కేంద్రం కొట్టినందుకా? వైసీపీ నవ్వినందుకా?

0
478

cm-jetly-jagan

 

 

రాజ్య సభ ,లోక్ సభ ల్లో కేంద్ర ఆర్ధికమంత్రి జైట్లీ ప్రకటనల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టారు .ఈ రెండు సార్లు కేంద్రం ఏమి చేయలేదని మాట్లాడారు .అంతకన్నా ఎక్కువగా మరో విషయాన్ని అయన ప్రస్తావించారు.ప్రధాని ,కేంద్రానికి తాను భయపడుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు.నాకెందుకు భయం? నేను ఎవరికి భయపడాలి ? అంటూ ఆ అంశాన్ని సాగదీశారు.పదే పదే తన రాజకీయ,వ్యక్తిగత జీవితాన్ని వివరించడానికి ప్రయత్నించారు.

ఇదంతా చూస్తున్న వాళ్లకి ప్రత్యేక హోదా అంశం లో కేంద్రం కొట్టిన దెబ్బ కన్నా …ప్రధానికి భయపడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న ఎగతాళే చంద్రబాబుని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది.ఇన్నేళ్ల రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు కూడా వైసీపీ విమర్శలపై ఇంతగా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాబు ఉడుక్కోవడం చూసిన ప్రత్యర్ధులు అయన వ్యవహారం గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్న చందమని ఇంకాస్త వుడికిస్తున్నారు .

Leave a Reply