పవన్ తో ఛాన్స్ కొట్టేసిందా..!

0
638

Posted [relativedate]

pv123ఒకేసారి మూడు సినిమాలకు పనిచేసే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాన్. కాటమరాయుడు మూవీ సెట్స్ మీద ఉండగానే నేసన్ డైరక్షన్లో మూవీకి కొబ్బరి కాయ కొట్టాడు. ఆ మూవీ స్టార్ట్ అవ్వక ముందే త్రివిక్రం శ్రీనివాస్ తో మరో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. ఈ క్రమంలో కెరియర్ లో ఎన్నడు లేని స్పీడ్ అందుకున్నాడు పవర్ స్టార్. ఇక త్రివిక్రంతో సినిమా మళ్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ కు సంబందించిన కథే అని తెలుస్తుంది.

ఈసారి అత్తగా ఖుష్బుని ట్రై చేస్తున్నారట. అంతేకాదు ఇందులో కూడా పవన్ కు ఇద్దరిని జతకడుతున్నాడు త్రివిక్రం. జల్సాలో ఇలియానా, పార్వతి మెల్టన్. అత్తారింటికి దారేది సినిమాలో సమంత, ప్రణీత ఇప్పుడు రాబోతున్న సినిమాలో కూడా ఇద్దరిని సెట్స్ చేస్తున్నాడట. అయితే అందులో ఒక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్ అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రంతో అఆ సినిమా చేసిన అనుపమ నటనకు ఇంప్రెస్ అయిన త్రివిక్రం కచ్చితంగా పవర్ స్టార్ సినిమాలో ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. అదే కనుక నిజమైతే అనుపమకు లక్ తగిలినట్టే.

Leave a Reply