Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అదేంటి సంగారెడ్డి కాంగ్రెస్ సభకు వీహెచ్ హాజరయ్యారు కదా అనుకుంటున్నారా. అక్కడ సరే.. గుంటూరులో జరిగిన ప్రత్యేక హోదా సభకు మాత్రం ఆయనకు ఆహ్వానం అందలేదట. పార్లమెంటులో ఓబీసీ ఎంపీల ఫోరం కన్వీనర్ గా ఉన్నా.. తనపై ప్రాంతీయ నేత ముద్ర వేయడం వీహెచ్ కు ఏమాత్రం నచ్చలేదట. ఎక్కడో యూపీ నుంచి అఖిలేష్ ను, బీహార్ నుంచి శరద్ యాదవ్ ను పిలిచి.. పక్కనే ఉన్న తనను పిలవకపోవడమేంటని వీహెచ్ ఏపీ నేతలకు ఫోన్ చేసి మరీ అడిగారట.
వీహెచ్ కు కోపం వచ్చిందని అర్థం చేసుకున్న ఏపీ నేతలు.. ఎలాగోలా బుజ్జగించడానికి తంటాలు పడుతున్నారు. వీహెచ్ ను పిలిస్తే ఏపీ ప్రజలకు కోపమొస్తుందని, అందుకే పిలవలేదని సర్దిచెబుతున్నారు. కానీ వీహెచ్ మాత్రం ససేమిరా అంటున్నారు. రాహుల్ ముందు పని గట్టుకుని అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంతవరకూ ఏపీ సమస్యలపైనా స్పందిస్తున్నా, ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నా.. ఏఫీ నేతలకు పొరుగింటి పుల్లకూర రుచైందని మండిపడుతున్నారు వీహెచ్.
సీనియర్ నేతలు వీహెచ్ కు సర్దిచెప్పడానికి ట్రై చేస్తుంటే.. జూనియర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణలోనే సీన్ లేని వీహెచ్ ను మనం ఎందుకు పిలవాలని ప్రశ్నిస్తున్నారట. దీంతో అటు వీహెచ్ ను సముదాయించలేక, ఇటు జూనియర్లకు చెప్పలేక ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా సతమతమౌతున్నారు. ఓవైపు సభ ఫ్లాప్ అయిందని బాథపడుతుంటే.. ఇంట్లో ఈగల మోత ఏంటని వాపోతున్నారు రఘువీరా.