Posted [relativedate]
హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా భారతీయ సినిమాకి గౌరవం తెచ్చిపెట్టిన దర్శకుల్లో ఒకరు ది గ్రేట్ మణిరత్నం.ఇక కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట.తాజాగా తెలుస్తున్న దాన్ని బట్టి సుకుమార్ తో సినిమా కంప్లీట్ కాగానే చరణ్,మణితో సినిమా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి శుక్రవారానికి లెక్కలు మారే సినీ రంగంలో అన్నీ అనుకున్నట్టు జరుగుతాయని చెప్పలేం. ఇప్పుడు అలాంటి ఓ సందిగ్ధ పరిస్థితి తెచ్చిపెట్టింది మణిరత్నం లేటెస్ట్ రిలీజ్ చెలియా.
చెలియా సినిమా రిజల్ట్ అనుకున్నట్టు లేదని ట్రేడ్ సర్కిల్స్ డిసైడ్ చేసేశాయి.దీంతో మణితో ఇప్పుడు సినిమా అంత సేఫ్ కాదని చెప్పేవాళ్ళు చరణ్ కి ఇప్పటికే చెప్పేసారు.మెగా ఫ్యాన్స్ సైతం అదే ఆలోచన చేస్తున్నారు.ఓ వైపు మణి లాంటి గొప్ప దర్శకుడికి ఇచ్చిన మాట,ఇంకోవైపు తనని అభిమానించే వారి అభ్యంతరం …ఈ రెంటి మధ్య మణి సినిమా చరణ్ కి ఓ పరీక్షగా మారింది. దీన్ని చరణ్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.