ప్రత్యేక హోదా ఉద్యమం సజావుగా నడుస్తుందా?

Posted [relativedate]

is special status meeting doing peacefully in rk beach vizagజల్లికట్టు స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ యువత తలపెట్టిన ప్రత్యేకహోదా ఆందోళన ఎంత వరకు విజయవంతమవుతుందో అనే భయం కలిగిస్తుంది అధికార పార్టీ. జల్లికట్టు ఆందోళన విజయతీరాలకు చేరడం లో అన్ని పార్టీల ఏకాభిప్రాయం కూడా ముఖ్య పాత్ర పోషించింది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రకటనల సారాంశం చూస్తుంటే ఆయనకు ప్రత్యేక హోదా ఉద్యమం జరగడం ఏమాత్రం ఇష్టం లేదు అనిపిస్తుంది.

“ఎంత పెద్ద మీటింగ్ కి అయినా ఎవరో ఒకరు ఆర్గనైజర్ ఉంటారు. కానీ వైజాగ్ ఉద్యమానికి అలాంటి వారెవరూ కనిపించడం లేదు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇంత పెద్ద నిరసన కార్యక్రమం ఎలా చేస్తారు.” అని డి జి పి గారు సెలవిచ్చారు. ఆర్గనైజర్ ఉండడానికి ఇదేమన్నా పెళ్ళా? పేరంటమా? యువత తమలో తాము నిర్ణయించుకున్న నిరసన. పదిమంది కలిసి మాట్లాడుకునే స్వేచ్చ లేకపోవడానికి మనదేశం నియంతృత్వ దేశమా? మనం నియంతల పాలనలో ఉన్నామా? బహుశా “డిక్టేటర్” ల పాలనలోనే ఉన్నామేమో? లేకపోతే ఈ ఆంక్షలేంటి? ముఖ్యమంత్రి గారు “రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అభివృద్ధి జరుగుతుందా?” అన్నారు. గొడవలు పెట్టుకోవక్కరలేదు కానీ వంగి వంగి దండాలు పెడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని డిల్లీ పెద్దల కాళ్ళ ముందర తాకట్టు పెట్టాల్సిన పని లేదు కదా. అనుభవం లేదు అంటున్నారు మరి అనుభవం ఎవరికీ పుట్టుక తోనే రాదు. ఇంత అనుభవం ఉండి ఈ మూడేళ్లలో బాబు గారు సాధించింది ఏంటో అందరికీ తెలుసు.

ప్రత్యేకహోదా మా హక్కు అని యువత ఏక కంఠంతో ఘోషిస్తుంటే పాలకుల చెవిన పడటం లేదు. రాష్ట్ర భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకొని ఇప్పటికైనా అధికార పార్టీ కూడా ఈ ఆందోళన కి మద్దతిచ్చి ఉద్యమ ఫలితం సానుకూలం గా ఉండేలా కృషి చేయాలని మా మనవి.

అధికార పార్టీ మద్దతు లేకపోతే ఉద్యమం శాంతియుతం గా కష్టం. పోలీసులు అధికార పార్టీ పక్షానే ఉంటారు. పోలీసులు లాఠీ చార్జ్ అంటూ జులుం చూపిస్తే యువత ఆవేశపడతారు. ఉద్రిక్త పరిస్తితులు, హింసాకాండ చోటు చేసుకోవచ్చు. అందుకే పోలీసులైనా యువత అయినా సంయనం పాటించాలి.

Leave a Reply