ఆ మాటల వెనుక ‘బాహుబలి 3’ ఉందా?

214

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Is there the bahubali 3' behind those words
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు కూడా సంచలన విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘బాహుబలి 2’ తాజాగా విడుదలై 1500 కోట్లు వసూళ్లు చేసి ప్రస్తుతం రెండు వేల కోట్ల వైపుకు పరుగులు పెడుతుంది. ఈ సమయంలోనే ‘బాహుబలి 3’కి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. రెండు పార్ట్‌లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మూడవ పార్ట్‌ కూడా వస్తే ప్రేక్షకుల నుండి ఆధరాభిమానాలు దక్కుతాయని అంతా ఆశిస్తున్నారు.

హిందీ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆ మద్య మాట్లాడుతూ మూడవ పార్ట్‌ చేస్తూ బాగుంటుందని అన్నాడు. ఆయన రాజమౌళితో పాటు రచయిత విజయేంద్ర ప్రసాద్‌పై కూడా ఒత్తిడి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడవ పార్ట్‌ ఇప్పుడు కాకున్నా మరో రెండు మూడు సంవత్సరాలకు అయినా తీసుకు రావాలని కరణ్‌ జోహార్‌ కోరుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘బాహుబలి’ నిర్మాత చేసిన ట్వీట్‌ మూడవ పార్ట్‌ గురించి మరింతగా చర్చకు తెర లేపుతుంది. నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్‌లో ఒకసారి జరిగింది రెండవ సారి జరగక పోవచ్చు, అయితే రెండవ సారి జరిగింది ఖచ్చితంగా మూడవ సారి జరుగుతుందనే నమ్మకం ఉంది అంటూ పోస్ట్‌ చేశాడు. శోభు యార్లగడ్డ  ట్వీట్‌ వెనుక ఉద్దేశ్యం బాహుబలి 3వ పార్ట్‌ ఉంటుందని అంటూ అంతా భావిస్తున్నారు. చూద్దాం ‘బాహుబలి 3’ పార్ట్‌ వస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here