ఐసిస్‌ పని అయిపోయిందా…!

Posted November 4, 2016
  • isis is finished by iraq and americaఇరాక్‌ సేనల దూకుడుతో ఉక్కిరిబిక్కిరి

 ఒకవైపు ఇరాక్‌ సేనల దూకుడు మరో వైపు అమెరికా దళాల ముట్టడి మధ్య ఐఎస్‌ఐఎస్‌(ఐసిస్‌) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వారికి కేంద్రస్థానంగా మారిన మోసుల్‌ నగరం ఇప్పుడు వారి చేతి నుంచి జారిపోనుందా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే అలానేగే అనిపిస్తుంది. చివరకు ఐసిస్‌ అధినేత అబూ బక్ర్‌ అల్‌ బాగ్దాదీ కూడా కంగారు పడే స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి.. ప్రస్తుతం ఐసిస్‌ పూర్తిగా ఆత్మరక్షణలో వెళ్లినట్లు కనిపిస్తుంది..

isis is finished by iraq and americaఐఎస్‌ ఆధీనంలో ఉన్న మోసుల్‌ నగరాన్ని ఇరాక్‌ సేనలు చుట్టుముట్టడంతో.. ఎట్టకేలకు నోరు విప్పాడు. కడదాకా పోరాడాలని, వెనకడుగు వేయవద్దంటూ జిహాదీ మూకలకు పిలుపునిచ్చాడు. ఈ మేరకు బాగ్దాదీ పంపిన సందేశాన్ని ఐఎస్‌ అనుబంధ సంస్థ విడుదల చేసింది. కాగా గత ఏడాది నుంచి బాగ్దాదీ బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. 2014 జూన్‌లో మోసుల్‌ నగరాన్ని ఐఎస్‌ జిహాదీలు ఆక్రమించుకున్న సమయంలో బాగ్దాదీ బహిరంగంగా కనిపించి.. ఇరాక్‌, సిరియాల్లో ఖలీఫా రాజ్య స్థాపనపై ప్రకటన చేశాడు. అయితే గత ఏడాది కాలంగా పలు ప్రాంతాల్లో ఐఎస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో వారు ఆక్రమించుకున్న ఇరాక్‌లోని ఫలూజా, సిరియాలోని దబిక్‌ వంటి నగరాలపై పట్టు కోల్పోయింది. ప్రత్యేకించి ఇరాక్‌ సేనలు ఐఎస్‌పై పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐఎస్‌కు కీలకమైన మోసుల్‌ నగర శివార్లకు గతవారమే చేరుకున్నాయి.
isis is finished by iraq and america బాగ్దాదీ మోసుల్‌లోనే తలదాచుకున్నట్లు, అతణ్ని అంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే బాగ్దాదీ స్వయంగా ప్రకటన చేసినట్లుగా సందేశం విడుదలైంది. ఈ సందేశంలో సౌదీ అరేబియా, టర్కీల్లోనూ దాడులు చేయాల్సిందిగా జిహాదీలకు అతడు పిలుపునిచ్చాడు. అంతేకాదు.. ఇరాక్‌కు, సిరియాకు రాలేనివారు లిబియాలో దాడులకు దిగాలని సూచించాడు. దీంతో మోసుల్‌కు సమీపంలోనే ఉన్న అంకారాలో బలగాలను మోహరించారు. కాగా మోసుల్‌లో 3వేల నుంచి 5వేల వరకు ఐఎస్‌ ఉగ్రవాదులున్నట్లు భావిస్తున్న ఇరాక్‌ బలగాలు.. వారిని ఏరివేసేందుకు అమెరికా సంకీర్ణ సేనల అండతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిణామలన్నీ గమనిస్తే మరి కొద్ది రోజుల్లోనే ఐసిస్‌ సంస్థ కకావికలం కావడం కాయంగా కనిపిస్తుంది.
SHARE