సెన్సార్ రివ్యూ : ఇజం

Posted October 14, 2016

 ism movie censor report

పూరి-కళ్యాణ్ రామ్ ల కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం “ఇజం”. ఫస్ట్ లుక్ తోనే పూరి మార్క్ కనిపించింది. దీంతో.. ‘ఇజం’పై ప్రేక్షకుల్లో భారీ అంచానలు నెలకొన్నాయి. ‘ఇజం’ టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. పూరి మరోసారి మాయ చేయబోతున్నాడా.. ? అంటూ టాలీవుడ్ ఆసక్తికరంగా ఎదురు
చూస్తోంది.

తాజాగా, ‘ఇజం’ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ని జారీచేశారు. సెన్సార్ బోర్డ్ సభ్యుల సమాచారం ప్రకారం.. ఇది పక్కా పూరి మార్క్ సినిమా. కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలువనుందట. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమాలో సెంటిమెంట్ యాంగిల్ కూడా ఉందట. కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్‌గా కనిపించనున్న ‘ఇజం’, ఇంటర్నేషనల్ బ్లాక్‌మనీ అనే అంశంపై తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ తో పాటుగా.. జగపతిబాబు పాత్ర సినిమాకి హైలైట్ గా నివనుందని చెబుతున్నారు. మొత్తానికి.. సెన్సార్ రివ్యూ పాజిటివ్ గా  ఉండటంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీ.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జంటగా  అదితి ఆర్య జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. కళ్యాణ్ రామ్ నిర్మాత.

SHARE