ఇజం మూవీ ప్రివ్యూ…

 Posted October 20, 2016

ism movie preview

చిత్రం : ఇజం (2016)
నటీనటులు : కళ్యాణ్ రామ్, అదితిఆర్య
దర్శకుడు : పూరి జగన్నాథ్
నిర్మాత : కళ్యాణ్ రామ్
రిలీజ్ డేట్ : 21అక్టోబర్, 2016.

‘ఇజం’ టైటిల్ తోనే ఆసక్తిని కలిగించారు. ‘ఇజం’ ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచేశారు. టీజర్ తో.. ఆ అంచనాలు రెట్టింపు చేశారు. నిజం.. ఇప్పుడంతా ‘ఇజం’కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాథ్-కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘ఇజం’. ఇందులో కళ్యాణ్ రామ్ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నారు. అదితిఆర్య కథానాయిక. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.

“అవినీతిపై ఓ జర్నలిస్ట్‌ ఎలాంటి పోరాటం చేశాడు. తద్వారా ఎదురైన సమస్యలను అతనెలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కథ”. దీనికి పూరి కోటింగ్ పడింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్స్ లో పూరి మార్క్ కనబడింది. దీనికి తోడు కళ్యాణ్ రామ్ ని మార్చిన విధానం ఆకట్టుకుంటోంది. హీరోయిజాన్ని ఎలిమేట్ చేసే పూరి ‘ఇజం’కథకి కళ్యాణ్ కరెక్ట్ అంటున్నాడు. అదెంత వరకు నిజమన్నది రేపటితో తేలిపోనుంది. మరోవైపు, ఈ క్రిడిట్ అంతా దర్శకుడు పూరి జగన్నాథ్ ని సినిమా రిలీజ్ తర్వాత పూరి గురించి ఓ గంటపాటు మాట్లాడతా.. అంటున్నాడు కళ్యాణ్. వీరి బాండింగ్ ఇంత బలపడటానికి కారణం కూడా ‘ఇజం’లో కనబడనుంది.  మొత్తానికి.. ‘ఇజం’తో నిజమేంటో తెలియనుంది.

‘ఇజం’ ఇలా ఉండబోతోంది :
పూరి సినిమా అనగానే హీరో-హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ భలేగుంటింది. ఈ సినిమాలోనూ ఫస్ట్ లో హీరో-హెరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సరదా సరదాగా
సాగుతాయట. దీంతోపాటుగా, మీడియా వాతావరణాన్ని పరిచయం చేస్తాడట. ఇక, ఇంట్రెవెల్ బ్యాంగ్ లో అసలైన ట్విస్ట్ ఇచ్చేసి. సెకాండాప్ రక్తికట్టిస్తాడట పూరి. వికీ లీక్స్, ప‌నామా లీక్స్ వంటి సీరియ‌స్ స‌బ్జెక్ట్.. స‌మాజంలో అవినీతి, న‌ల్ల‌ధనం కూడబెట్టిన బాబుల‌పై సెటైర్లు ఉండనున్నాయట. ముఖ్యంగా రెండవ భాగంలో వచ్చే సన్నివేశాల్లోనూ, అలాగే కోర్టు సన్నివేశాలలో కళ్యాణ్ అద్భుతమైన నటనను ప్రదర్శించారని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో నటనకి గానూ కళ్యాణ్ రామ్ కి అవార్డులు కూడా వస్తాయని దర్శకుడు పూరి చెబుతున్నాడు.

ఇన్ని అంచనాల మధ్య (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఇజం’.. నిజంగానే అంచనాలని అందుకుంటుందా.. ?లేదా.. ?? అన్నది మరికొద్ది సమయంలో  తేలనుంది. ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి.. మీ తెలుగు బుల్లెట్ డాట్ కామ్.

SHARE