కావేరి సమస్యకి ఇజ్రాయిల్ పరిష్కారం..

0
569

Posted [relativedate]

 israel country scientist solve tamil nadu karnataka cauvery water war problem
కావేరి సమస్య కర్ణాటక ,తమిళనాడు మధ్య ఎంత అగ్గి రాజేసిందో చూస్తూనేవున్నాం.ఆ సమస్య ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. సుప్రీమ్ తీర్పుని అమలు చేయడానికి కర్ణాటక ససేమిరా అంటోంది.కావేరి లో నీళ్లు తక్కువున్నప్పుడల్లా ఆ రెండు రాష్ట్రాల మధ్య జగడం తప్పడం లేదు .అన్ని పార్టీలు ఓట్ల వేటకే ప్రాధాన్యమివ్వడంతో రాజకీయ పరిష్కారం కూడా దొరకడం లేదు.అసలు ఆ దిశగా ప్రయత్నిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు.ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ ఆ సమస్యకి ఓ పరిష్కారం సూచిస్తోంది.

కావేరి మీద ఆధారపడే రైతులు కర్ణాటక లో చెరుకు,దిగువన తమిళనాడులో వరి సాగుకి మొగ్గుచూపుతున్నారు.దీంతో ఇరు ప్రాంతాల రైతులకి నీటి వినియోగం ఎక్కువగా ఉంటోంది.అయితే ఆ రెండు పంటల సాగు విధానాల్లో మార్పు ద్వారా ఇప్పుడు వాడే నీటిలో సగం మాత్రమే  వాడి దిగుబడులు కూడా గణనీయం గా పెంచుకోవచ్చని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం చెబుతోంది.తాము అనుసరిస్తున్న మైక్రో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అమలు చేయడాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపింది.దీని వల్ల చెరుకు దిగుబడి 163 శాతం పెరుగుతుందని ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మైక్రో డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించిన ప్రదర్శన కూడా ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు ఇచ్చారు.భారత్ లోని ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తే కలిసి పనిచేయడానికి సిద్ధమని ఇజ్రాయిల్ ప్రకటించింది.అయితే రైతుల ఆలోచనా విధానాల్లో మార్పు అన్నిటికన్నా కీలకమని ఇజ్రాయిల్ అభిప్రాయపడుతోంది.

ఇజ్రాయిల్ నీటి లభ్యత విషయంలో ఇప్పటికీ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది.అయితే వ్యవసాయ వినియోగానికి సంబంధించి అనుసరిస్తున్నఆధునాతన విధానాల వల్ల ఆ సమస్యని అధిగమించి మన కన్నా ఎక్కువ దిగుబడులు సాధిస్తోంది.ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రతిపాదనను అందిపుచ్చుకోవడమా,లేదా అన్నది మన చేతుల్లోనే వుంది.

Leave a Reply