కుర్రాళ్లు కళ్లు తెరవండి…

0
555
isro Experiment on 103 satellites in single rocket in february

Posted [relativedate]

isro Experiment on 103 satellites in single rocket in february
శాతకర్ణి ,ఖైదీ150…
ఇవేనా మన తెలుగు గడ్డపై జరుగుతున్న పండగలా …
వాళ్ళ వాళ్ళ సినిమా బిజినెస్ జరుగుతుంది కానీ
అసలు పండుగ ముందుంది చూడండి..

ఫిబ్రవరిలో తెలుగు గడ్డవైపు ప్రపంచం చూడబోతోంది..
ఇస్రో ఏకంగా ఒక రాకెట్ ద్వారా 103 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపబోతోంది..

ప్రపంచదేశాల యువత అంతా ఈ విషయం చర్చించుకుంటుంటే ప్రయోగం జరుగుతున్న మన సొంత రాష్ట్రంలో దాని వూసే లేదు.

దేశానికి పేరు తెస్తూ, దాదాపు 1500 కోట్ల ఆదాయం కూడా తెస్తున్న ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనత పై మనం సంబరాలు చేసుకోవాలి…
యువత ఇటు వైపు దృష్టిపెడితే వారి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది…
తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు, ఉపాధ్యాయులు దీనిపై ఆసక్తి పెడితే భవిష్యత్ లో మన పిల్లల నుండే అబ్దుల్ కలామ్ లు ఉద్భవిస్తారు……
ఇలాంటి పోస్ట్ లు యువతలోకి మరింత వెళ్లాలి..దేశప్రయోజనాలు కోరుకొనేవారు ఇటువంటి పోస్ట్ లు ఒక్కటైనా పెట్టి ప్రచారం కలిపిస్తారని కోరుకుంటూ

Leave a Reply