ఇస్రో నీటి కొలత ….

0
560

isro water measurement
తెలంగాణలో నీటి వనరులపై ప్రాధాన్యం ఇస్తున్న టీ సర్కార్ …మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న నేషనల్ రిమోట్ సెన్సార్ సెంటర్ . ఇపుడు కొత్తగా తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థను నిర్మించేందుకు ఓకే చెప్పింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్రోతో ఆగస్టు6న ఎంవోయూ కుదుర్చుకోనుంది. మంత్రి హరీశ్ రావు.. ఇస్రో ఛైర్మన్ ల ఆధ్వర్యంలో ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.

ఈ కొత్త విధానం ద్వారా.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీల్లో జలవనరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయడంతోపాటు… ఉపగ్రహ చిత్రాలతో నీటి నిల్వలు, ఇతర అంశాలను విశ్లేషించనున్నారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ప్రాజెక్టులను నిర్వహిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అంటోంది ఇస్రో. ఇదే విషయంపై ఇస్రో బృందంతో సచివాయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మంత్రి హరీశ్. ప్రాజెక్టులకు అందించే సాంకేతిక పరిజ్ఞానంపై..

ఇస్రో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిపై సంతృప్తి వ్యక్తంచేసిన మంత్రి.. ఈ అవకాశాన్ని ఇరిగేషన్ ఇంజనీర్ల, సమర్థంగా వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో చెరువులన్నీ నిండినందున. మిషన్ కాకతీయకు ముందు.. తరువాత చెరువుల చిత్రాలు విశ్లేషించాలని కూడా చెప్పారు.

Leave a Reply