లోక్ సభ లో ఆమోదం పొందిన ఐటీ చట్ట సవరణ బిల్

140

Posted November 29, 2016, 5:27 pm

Image result for it amendment in loksabha

ఉభయ సభల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించిన ఐటీ చట్ట సవరణ బిల్లు మంగళవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. ఈ బిల్లుపై విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణల్ని లోక్‌సభ స్పీకర్‌ తిరస్కరించారు. బిల్లుపై సమగ్ర చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల నిరసనల మధ్యనే ఈ సవరణ బిల్లును ఆమోదించారు. ప్రస్తుత సమయంలో బిల్లుపై సమగ్ర చర్చ సాధ్యం కాదని పేర్కొంటూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు.

సోమవారం ఉభయసభల్లో ఐటీ చట్టసవరణ బిల్లును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.నల్లధనానికి పేదల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ముడిపెడుతూ కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద అక్రమ ఆదాయాన్ని వెల్లడించేందుకు నల్లకుబేరులకుఅవకాశం ఇచ్చింది డిసెంబర్‌ 30లోపు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని స్వచ్ఛందంగా ప్రకటిస్తే మొత్తం మీద 50శాతం పన్నుతో సరిపెడతామని, దాడుల్లో దొరికితే 85 శాతం ఫైన్ అని చెప్పారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here