షాక్‌.. మహేష్‌ నుండి ఇది ఊహించలేదు

0
491
It did not expect shock from Mahesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

It did not expect shock from Mahesh
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఒక వైపు ‘స్పైడర్‌’ చిత్రీకరణ ముగింపు దశలో ఉన్నాడు. ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ సినిమా ఇంకా పూర్తి కాకుండానే మహేష్‌బాబు మరో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇటీవల ఒక స్టార్‌ హీరో ఒక సినిమా విడుదల కాకుండానే మరో సినిమాలో నటించడం చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో ఒక సినిమా కాకుండా ఒకే సమయంలో అయిదు నుండి పది సినిమాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. పూర్తిగా ఒకే సినిమాకు స్టార్స్‌ కేటాయిస్తున్నారు.

ఒక సినిమా పూర్తి అయ్యి, విడుదల చేసిన తర్వాత ఆ సినిమా ఫలితాన్ని బట్టి తర్వాత సినిమా ఎంపిక చేసుకుంటూ ఉన్నారు. అయితే మహేష్‌బాబు మాత్రం అందుకు విరుద్దంగా ‘స్పైడర్‌’ చిత్రం ఇంకా సెట్స్‌ పై ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే కన్ఫర్మ్‌ అయిన ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. తాజాగా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. మొదటి షెడ్యూల్‌ను 15 రోజుల పాటు జరుపనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయిన నేపథ్యంలో ఈ సినిమా కూడా తప్పకుండా మరో బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply