భగవంతుడు మనకు ఇచ్చిన దాంతో తృప్తి పడడం మంచిది!!

185

Posted May 23, 2017, 7:36 pm at 19:36

It is good that God is satisfied with what he gave us
ఒక అడవిలో ఒక జింక ఉండేది. ఒక రోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది. అది నీరు త్రాగడం మానేసి, నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. కాసేపు తన ప్రతిబింబాన్ని అలా చూసుకుంటూ నిలబడింది. తనను తాను ఊహించుకుంటూ, ఆహా.. ఎంత పెద్ద కళ్ళు, ఎంత అందంగా ఉన్నాను, తమలపాకుల్లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం, ఇంకెవ్వరికైనా ఉంటుందా ?, ఇలా తన శరీరంలోని ఒక్కోభాగాన్ని చూసుకుంటూ, అందంగా వర్ణించుకుంటూ తన్మయత్మంలో నిలబడింది.ఇంతలో దాని దృష్టి తన కాళ్ళపై పడింది. వెంటనే దాని మొఖం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి ?, సన్నగా, పీలగా, ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళను ఎందుకు ఇచ్చాడు ? అని ఎంతో దిగులుపడింది.

అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండును కదా ! అని అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది. వెనుక ఎవరో చూడకుండా ఏ దిక్కువైపు నిలుచుందో, అదే దిక్కున ఒక్కసారిగా పరుగు తీసింది. అనుసరిస్తున్న అడుగుల శబ్ధం, చెంగు చెంగున అడుగులు వేస్తూ వేగంగా, అలుపు లేకుండా పరిగెత్తింది. సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరుగెడుతూనే ఉంది.

ప్రమాదం తప్పిపోయిందని గ్రహంచి, పరుగు ఆపేసి ఒక చెట్టుకింద నిలబడి “హమ్మయ్య.. ఎంత గండం గడిచింది”! అని అనుకుంది. ఆ గండం తప్పించిన తన కాళ్ళవైపు చూసుకుంది. అంతకుముందు తనకు ఎందో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు, ఇప్పుడు దేవుడు తనకు బంగారం లాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి, తన కాళ్ళను చూసి ఎంతో అందపడింది. అలాంటి కాళ్ళను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

మనలో చాలా మంది ‘నాకు భగవంతుడు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదూ అంటూ లోపాలను చూసి బాధపడుతుంటాం’ కానీ అది మన మంచి కోసమే అని తెలుసుకొని ముందుకు నడవగలిగితే ఎంతో మేలు. అది లేదు, ఇది లేదు అని బాధపడకుండా ఉన్న దానితో ఏమి చేయగలమో తెలుసుకుని మసలుకుంటే మేలు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here