జమిలి ఎన్నికలు అంత వీజీ కాదా..?

0
318
it is not easy to do before lok sabha and assembly elections for all states at a time

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

it is not easy to do before lok sabha and assembly elections for all states at a timeదేశమంతా జమిలి ఎన్నికలు నిర్వహిస్తే సమస్య ఏమిటి? ఏ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగానికి పలు సవరణలు చేయాల్సి ఉంటుందని నీతిఆయోగ్‌ ముసాయిదా నివేదిక చెబుతోంది. కొన్ని శాసనసభలను ముందుగానే రద్దు చేయాల్సి ఉండగా, మరికొన్నింటి గడువును పొడిగించాల్సి ఉంటుంది. ఇలాచేస్తే 2021 డిసెంబరు నుంచి ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు వీలవుతుందని సూచిస్తోంది. ఈలోగా 2019 జూన్‌లోగా లోక్‌సభకు, 14 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరపవచ్చని, దీనికి కూడా కొన్ని రాష్ట్రాలకు రెండేళ్ల గడువును పొడిగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదంతా జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యే అన్ని సంస్థల మధ్య ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుందని వెల్లడించింది.

ఒకేసారి ఎన్నికలు చేపడితే ఓటర్లపై ప్రభావం పడుతుందా? జాతీయస్థాయి అంశాలు రాష్ట్ర అసెంబ్లీల ఓటింగ్‌పైనా, రాష్ట్రస్థాయి అంశాలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లపైనా ప్రభావం చూపుతాయా అన్నదానిపై కూడా చర్చ సాగుతోంది. ఒకేసారి ఎన్నికల వల్ల ఓటర్లు ప్రభావానికి గురవుతారనీ, రెండుచోట్ల ఒకే రాజకీయ పార్టీకి ఓటు వేస్తారని, ఇది ప్రధాన జాతీయ పార్టీలకు ఉపయుక్తమనేది ఒక అభిప్రాయంగా ఉంది. తాజాగా ఐడీఎఫ్‌సీ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం సమాంతరంగా ఎన్నికలు జరిగితే సరాసరి 77 శాతం ఓటర్లు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకేపార్టీకి ఓటేసే అవకాశం ఉంది. లోక్‌సభకు, అసెంబ్లీలకు వేర్వేరుగా ఆరు నెలల తేడాతో జరిగిన ఆరు ఎన్నికలను కూడా విశ్లేషించగా..61 శాతం అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే లోక్‌సభకు గెలుపొందిన పార్టీ అభ్యర్థులనే ఎన్నుకొన్నారు.

పార్లమెంట్‌, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాలి. రాజ్యాంగంలోని 2, 3 ఛాప్టర్లు, పార్ట్‌ 15లోని సంబంధిత అధికరణలను సవరించాల్సి ఉంది. సవరణలను పార్లమెంట్‌లో మూడింట రెండోవంతు మెజారిటీతోపాటు కనీసం సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాలి. కొన్ని శాసనసభల కాలపరిమితిని పెంచడం, మరికొన్నింటిని తగ్గించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని కేంద్రం ముసాయిదా రూపొందించాకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఉంటుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రతి పార్టీ ప్రణాళిక ప్రకారం మేనిఫెస్టో విడుదల చేయడంతోపాటు వాటిని అయిదేళ్లలో అమలు చేయని పక్షంలో ప్రజలే సరైన తీర్పు ఇస్తారు.

Leave a Reply