ఆ ఐటీ దాడుల వెనుక రహస్యమిదేనా?

0
523

Posted [relativedate]

  it rides dk sathya prabha family
ఆంధ్ర,కర్ణాటకలో డీకె ఆదికేశవులు కుటుంబ సభ్యులపై ఐటీ వరసపెట్టి ఐటీ దాడులు చేయడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.అధికార పార్టీలో ఉన్నవారిపై ఇంత టార్గెట్ ఎందుకు చేశారోనని ఎవరికీ అర్ధం కాలేదు.కానీ ఆ దాదాపు లెక్కల్లో లేని నగదు 250 కోట్ల దాకా దొరికినట్టు వార్తలు వస్తున్నాయి.అయితే అంతకు మించిన విషయం ఇప్పుడు బయటికి వినిపిస్తోంది.తాజా ఐటీ దాడుల్లో దొరికిన సొమ్మంతా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాదిగా తెలుస్తోంది.కింగ్ ఫిషర్ సహా వివిధ వ్యాపారాలకు సంబంధించి అప్పులు ఎగ్గొట్టి లండన్ పరారైన విజయ్ మాల్యా కి డీకె కుటుంబంతో వ్యాపార సంబంధాలున్నాయి.ఇద్దరూ లిక్కర్ వ్యాపారంతో ముడిపడిన వారేకావడంతో కుటుంబాల మధ్య కూడా స్నేహం కొనసాగింది.

ఆ స్నేహ బంధాన్ని అడ్డుపెట్టుకొని విజయ్ మాల్యా తన దగ్గరున్న అక్రమ ధనాన్ని డీకె కుటుంబ సభ్యులకి చేరవేసినట్టు ఐటీ అధికారులకి స్పష్టమైన సమాచారం లభించిందట.ఆ సమాచారం ఆధారంగానే తాజా దాడులు జరిగినట్టు తెలుస్తోంది.చివరికి దాడుల్లో పాల్గొన్న అధికారులు సైతం అప్పట్లో మాల్యా ఇంటి మీద దాడులు జరిపిన వారేనట.

Leave a Reply