చిన్నమ్మకి జై కొట్టగానే ఐటీ రైడ్..షాక్ లో శరత్

0
523
it rides on hero sarath kumar and TN minister Vijayabaskar

Posted [relativedate]

it rides on hero sarath kumar and TN minister Vijayabaskar
తమిళనాట ఐటీ దాడుల కలకలం ఇప్పట్లో ఆగేట్టు లేదు.జయ మరణం తర్వాత విడతలవారీగా సాగుతున్న ఐటీ రైడ్స్ షాక్ ఇప్పుడు ఓ తమిళ మంత్రికి,యాక్టర్ కం రాజకీయ నాయకుడు శరత్ కుమార్ కి ఘాటు గానే తగిలింది.ఈ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందని చిన్నమ్మ వర్గం నెత్తినోరు బాదుకుంటోంది.పాపం ..శశికళ వర్గం మాటల్లోనూ నిజం ఉందనిపిస్తోంది. ఎందుకంటే జయ మరణం తర్వాత శశికళ నుంచి అన్నాడీఎంకే పగ్గాలు,ప్రభుత్వ పగ్గాలు లాక్కోవాలని బయటకు కనపడకుండా బీజేపీ చేయని ప్రయత్నం లేదు.అయినా ఆ పప్పులు ఉడకలేదు.ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా మరో ప్రయత్నం చేస్తోంది బీజేపీ.

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఏ వర్గం గెలిస్తే అన్నాడీఎంకే మీద వారికి నైతిక పట్టు దొరుకుతుందని అందరికీ తెలుసు.అందుకే బీజేపీ పోటీలో వున్నా పన్నీర్ వర్గం అక్కడ గెలవాలని కేంద్రంలోని కమలం పెద్దలు కోరుకుంటున్నారు.అందుకే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైం లో ఐటీ శాఖ శశి వర్గానికి భారీ షాక్ ఇస్తోంది.శశి కనుసన్నల్లో సీఎం అయిన పళనిస్వామి మంత్రివర్గంలోని ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ని ఐటీ శాఖ అధికారులు టార్గెట్ చేశారు.ఇంతకుముందు ఐటీ దాడుల్లో దొరికిపోయిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు,చిన్నమ్మ సన్నిహితుడు శేఖర్ రెడ్డికి ఈ విజయ్ భాస్కర్ చాలా క్లోజ్ .అలాంటి మంత్రి ఆస్తుల మీద ఏకకాలంలో 30 చోట్ల ఐటీ బృందాలు దాడులు చేశాయి.అదే టైం లో ఇటీవల శశికళకి మద్దతు పలికిన సినీ నటుడు శరత్ కుమార్ ఇల్లు,కార్యాలయాల మీద కూడా ఐటీ శాఖ రైడ్ చేసింది.ఈ పరిణామాన్ని ఊహించని శరత్ కుమార్ షాక్ అయ్యారు.ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోపు ఇలాంటి దాడులు ఇంకెన్ని చూడాలో అని శశి వర్గం టెన్షన్ పడుతోంది.

Leave a Reply