100 కోట్లు పట్టేశారు…ఐటీ అధికారులు

Posted November 12, 2016

it rides on jewellery shop and currency exchange agentsనోట్ల రద్దు పుణ్యమా అని భారీ మొత్తంలో నల్లధనం బయట పడుతూ నదులు చెత్త కుప్పలు గుర్తింపులేని నకిలీ బ్యాంకుల్లా మారుతున్నాయి.నోట్ల రద్దుతో వర్తకులు అక్రమంగా విక్రయాలు జరుపుతున్నారని, లెక్కలు తేలని సొమ్ము విలువ రూ.100 కోట్లగా ఉందని అధికారులు అంటున్నారు వర్తకులు నిర్ధేశించిన సమయం లోపల తమ వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించారు . అదేవిధంగా కొన్ని రికార్డులను తాము స్వాదీనం పర్చుకున్నామని పేర్కొన్నారు.ఐటీ శాఖ సర్వే ఆపరేషన్స్ విస్తరణలో భాగంగా పన్ను ఎగవేసిన వర్తకుల నుంచి, ఇతర ఆపరేటర్ల దగ్గర్నుంచి ఈ నగదును ఐటీ శాఖ బయటికి రాబట్టింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కత్తా, ముంబాయి నగరాల్లో ట్రేడ్ కౌంటర్స్, దుకాణాల్లో ఐటీ విభాగం ఈ ఆపరేషన్ చేపట్టింది.

వర్తకులు, జ్యువెల్లరీ, కరెన్సీ ఎక్స్చేంజ్ ఏజెంట్స్, హవాలా డీలర్స్ డిస్కౌంట్ ధరలకు రూ.500, రూ.1,000 నోట్లను మారుస్తున్నారని ఐటీ డిపార్ట్మెంట్ ఈ దాడులు జరుపుతోంది. ఢిల్లీ లో ని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడు వద్ద నుంచి రూ.50 లక్షల మేర తరలిస్తుండగా టాక్స్ డిపార్ట్మెంట్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ యూనిట్ గుట్టురట్టు చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు తరలింపులపై పారామిలటరీ బలగాలు, పోలీసులు ఓ కన్నేసి ఉండాలని, ముఖ్యంగా సివిల్ ఎయిర్పోర్ట్స్, ఢిల్లీ మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లలో రద్దుచేసిన 500, 1000 రూపాయల నోట్ల తరలింపుకు అడ్డుకట్టు వేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది .

SHARE