సీఎస్ మీద ఎటాక్..శశికళ టార్గెట్?

0
320
it rides on tamil nadu chief secretary ram mohan but target is sasikala

Posted [relativedate]

it rides on tamil nadu chief secretary ram mohan but target is sasikala
తమిళ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న ఐటీ దాడుల వ్యవహారం లోగుట్టు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.ఎటాక్ జరిగింది రామ్మోహన్ మీద అయినా అసలు టార్గెట్ శశికళ అని తెలుస్తోంది.శశికళ కనుసన్నల్లో రామ్మోహన్ తో పాటు శేఖర్ రెడ్డి అండ్ కో ఎన్నో అక్రమాలకు పాల్పడినట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వున్నాయి.అయితే జయ గొడుగు కింద వుండే ఈ గ్రూప్ జోలికి వెళ్లేందుకు ఎవరికీ ధైర్యం చాల్లేదు.జయ మరణం తర్వాత కూడా అదే పరిస్థితి.అయితే పార్టీ పదవి తో శశికళ సంతృప్తి చెందకుండా ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేయడంతోనే అసలు సమస్య మొదలైంది.ఆమెకి మద్దతుగా అన్నాడీఎంకే నేతలు,ఎమ్మెల్యేలు,మంత్రులు పోయస్ గార్డెన్ కి వచ్చి మరీ ప్రకటనలు గుప్పించడంతో సీఎం పన్నీర్ సెల్వం జరగబోయే పరిణామాల్ని ఊహించారు.అపోలో వేదికగా అధికార మార్పిడికి సాయమందించిన కేంద్ర పెద్దలనే అయన సాయం అడిగారు.

పన్నీర్ విన్నపాన్ని బీజేపీ పెద్దలు సానుకూలంగా పరిశీలించి ప్లాన్ రెడీ చేసారంట. శశికళ వర్గానికి థింక్ ట్యాంక్ గా వున్న సీఎస్ మీదే వారి కన్ను పడిందట.అయితే నేరుగా అక్కడికి వెళ్లకుండా రామ్మోహన్ చెప్పుచేతల్లో నడిచే శేఖర్ రెడ్డి మీద ముందుగా దృష్టి పెట్టారు.దర్యాప్తులో అయన ఇచ్చిన సమాచారం ప్రకారం రామ్మోహన్ మీద టార్గెట్ చేశారు.కానీ అసలు టార్గెట్ మాత్రం శశికళ .ఆమె సీఎం పీఠం వైపు చూస్తే ఇవే పరిణామాలు పోయెస్ గార్డెన్ దాకా వెళతాయని హెచ్చరిక పంపినట్టయింది.విషయం అర్ధం అయిన శశికళ అండ్ టీం ప్రస్తుతానికి సైలెంట్ అయినట్టే అని తెలుస్తోంది.కానీ అవమానంతో రగిలిపోతోంది.అందుకే ఈ సహనం ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి.

Leave a Reply