సమయం ఆసన్నమైంది!!

0
264
its time for seshikala court case

Posted [relativedate]

its time for seshikala court caseశశికళ అక్రమాస్తుల కేసులో తీర్పు సమయం ఖరారైంది. మరికాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. జస్టిస్ పీసీ ఘోష్, అమితవ్ రాయ్ లతో కూడి ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించనున్నది. ఈ కేసులో ఏ 1 దివంగత సీఎం జయలలిత కాగా..శశికళ ఏ2 గా ఉన్నారు. శశికళతో పాటూ ఆమె కుటుంబ సభ్యులు ఇళవరసి, సుధాకరన్ కూడా నిందితులుగా ఉన్నారు. ఒకసారి ఆ కేసు డీటైల్స్ లోకి వెళ్తే..
1991 నుంచి 1996 జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అక్రమ ఆస్తులను కూడబెట్టిందంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పెషల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. రూ.66 కోట్లకు పైగా కూడబెట్టిందంటూ నమోదైన ఆ కేసులో.. డిసెంబర్ 7, 1996న జయలలితను అరెస్ట్ చేశారు. జయతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. 1997 లో సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిపింది. 1997 జూన్ 4న 120-బి ఐపీసీ, 13(2), 13(1) సెక్షన్ల కింద చార్జిషీట్ నమోదుకు కోర్టు ఆదేశించింది. కేసు కొట్టివేయాలంటూ 1997లో జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో అప్పటి గవర్నర్ ఫాతిమా బీవీపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. 2000 సంవత్సరం, ఆగస్టులో 250 సాక్షుల విచారణ అనంతరం.. అక్టోబర్ లో తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల శాఖలో అవినీతికి పాల్పడినట్లు జయలలితపై అభియోగాలు నమోదయ్యాయి. ఐతే.. ఈ కేసులో నమోదైన అభియోగాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2001లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. అన్నా డీఎంకేకు పూర్తి మెజారిటీ లభించింది. జయ లలితపై అభియోగాలు ఉండటంతో.. ఆమె ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఐతే.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జయ లలిత పోటీ చేసి గెలిచారు. 2002 ఫిబ్రవరి 21న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐనా.. కేసు మాత్రం జయలలితను వదిలిపెట్టలేదు.
2003 లో డీఎంకే జనరల్ సెక్రటరీ కె. అన్ బాంజ్ గాన్ ఆ కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటకు బదిలీ చేయాలని పిటిషన్ వేశారు. జయలలిత సీఎంగా ఉండటంతో ఆ కేసు పక్కదోవ పడుతుందని పిటిషన్ లో ఆరోపించారు. అందుకు అంగీకరించిన సుప్రీం.. కేసు విచారణ కర్ణాటకకు బదిలీ చేసింది. 2014 సెప్టెంబర్ 27న అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసిలను దోషులుగా తేల్చిన స్పెషల్ కోర్టు. నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల జరిమానా విధించింది. 2014 సెప్టెంబర్ 29న తీర్పును సవాలుచేస్తూ.. జయలలిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 2014 అక్టోబర్ 7న బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు.. జయ పిటీషన్‌ ను కొట్టివేసింది. 2014 అక్టోబర్ 9న బెయిల్ కోరుతూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. 2014 అక్టోబర్ 17న జయలలితకు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. 2015 మే 11 న కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ సహా నిందితులంతా నిర్దోషులంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు నించ్చింది. కానీ ఈ తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పు రానుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply