Posted [relativedate]
నందమూరి బాలకృష్ణ వందవ సినిమాగా ప్రతిష్టాత్మకంగా రూపొందించబడుతున్న సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. షూటింగ్ మొదటి రోజు నుండే అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమాకు సంబందించిన ప్రతి విషయం చాలా ఎక్స్ క్లూజివ్ గా ఉంచుతున్నారు. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ కోసం కూడా చాలా మంది పోటీ పడ్డా ఫైనల్ గా జె మీడియా ఫ్యాక్టరీ ఈ ఆడియో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యింది.
ఇప్పటికే 24 సినిమాల దాకా ఆడియో రిలీజ్ కార్యక్రమాలను చేసిన జె మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు బాలయ్య శాతకర్ణి సినిమాను దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ముగించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను స్టార్ట్ చేయనున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సాయి బాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.