Posted [relativedate]
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నదీ పరి వాహక ప్రాంతాల్లో ని సుమారు 50 విలాసవంత భవన నిర్మాణాలు,మరియూ విజయవాడ క్లబ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ,ఏడాది క్రితం లోకాయుక్త కోర్టు లో కేసు వేసినట్లు నాన్ పొలిటికల్ జె.ఏ.సి.రాష్ట్ర అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరి నాయుడు నేడు జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు
దీనిపై వివరణ ఇవ్వాలని లోకాయుక్త సి.ఆర్.డీ.ఏ.కమీషనర్ కు నోటీసులు జారీ చేసిందని అన్నారు.50 విలాసవంత భవనాల్లో సి.ఎం విశ్రాంతి గృహం,మంతెన సత్యన్నారాయణ రాజు కు చెందిన ప్రకృతి చికిత్స పేరుతో వైద్యశాల భవనాలు కూడా ఉన్నాయని ఆయన విలేఖరులకు చెప్పారు.