కృష్ణాజిల్లాలో తెరాస గెలుస్తుందా?

Posted April 4, 2017

jagadeesh reddy about trs winning in krishna
రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చనేది ఓ నానుడి.కానీ రాజకీయాల్లో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చనేది కొందరు నేతలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.ఆ కోవలో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఒకరు.తెరాస అధినేత,తెలంగాణ ముఖ్యమంత్రిని పొగిడేందుకు ఆయన సిద్ధపడ్డారు. అందులో తప్పేమీ లేదు.అయితే ఆ పొగడ్త శృతిమించి కామెడీ అయిపోయింది.కెసిఆర్ పరిపాలన సూపర్ గా ఉందని సూర్యాపేట జిల్లా కోదాడ పార్టీ కార్యాలయంలో జగదీష్ రెడ్డి అన్నారు.అంతటితో ఆగకుండా కెసిఆర్ పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా మెప్పిస్తోందని చెప్పారు.దానికి కూడా సర్దుకుందామనుకుంటే మంత్రిగారు ఇంకాస్త రెచ్చిపోయారు.

తెరాస కనుక పోటీ చేస్తే ఆంధ్రాలో కూడా గెలుస్తుందని మంత్రి కామెంట్ చేశారు.సరే ఏదో పార్టీలో ఉత్సాహం నింపడానికి అలా చేసాడు అనుకుందాం అనుకుంటే ఆయన ఇంకో అడుగు ముందుకేశారు.కృష్ణా జిల్లాలోని నందిగామ,జగ్గయ్య పేట నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులు గెలుస్తారని నమ్మకంగా కామెంట్ చేశారు.దీంతో పార్టీ సర్కిల్స్ లో విశ్వాసం నింపడానికి మంత్రి గారు చెప్పిన మాటలు చివరికి కామెడీగా మిగిలిపోయాయి.

SHARE