Posted [relativedate]
ఓ శిఖరం ఎక్కడం కన్నా అక్కడే నిలబడడం చాలా కష్టం. అందుకే గెలుపు గుర్రం ఓ చోట నిలవదు. అన్ని వైపులా పరిగెడుతుంటుంది.అది మన వైపు వచ్చే సహనం లేకుండా ఎదురెళ్లి ఎక్కేద్దామనుకుంటే అది మన దగ్గర ఆగుతుందని నమ్మలేం. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్,డబ్బు తీసుకుని మరీ సలహాలిచ్చేస్తున్న ప్రశాంత్ కిషోర్… ఇద్దరూ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.ఓడిపోయిన రెండోరోజునే వచ్చే ఎన్నికలు, ఊడిపోయే ప్రభుత్వం అంటూ మాట్లాడిన జగన్ …రెండున్నరేళ్ల ముందే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని బుక్ చేసుకున్నారు .ఈ మాట అనడం కొందరికి తప్పు అనిపించొచ్చు .కానీ అప్పుడు డిమాండ్ ఎలా ఉంటుందోనన్న భయమే …జగన్ అండ్ కో ని దీనికి ఉసికొల్పింది .ప్రశాంత్ భారీగా డిమాండ్ చేసినా వైసీపీ ఓకే అనేసింది .బీహార్ ఎన్నికల తరువాత ఈ ఒప్పందం కుదిరింది. జగన్ ఒప్పందానికి ముందే కాంగ్రెస్ తోనూ ప్రశాంత్ కిషోర్ జట్టు కట్టారు .శాంపిల్ గా యూపీలో కాంగ్రెస్ ని గెలిపించే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కి ఘోర పరాజయాలు ఎదురవుతున్న వేళ ప్రశాంత్ కిషోర్ రాక హస్తం శ్రేణుల్లో కొత్త ఆశలు పుట్టించాయి .పైగా నులక మంచాలతో రాహుల్ సభలు ఏర్పాటు చేసి ప్రశాంత్ ఏదో చేస్తాడన్న ఆశలు కల్పించాడు. ఆ తర్వాత యూపీ లో కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్న రీటా బహుగుణని కాదనిఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటింపజేసాడు. దాంతో రీటా బీజేపీ గూటికి చేరింది .అటు షీలా కూడా ప్రశాంత్ పనితీరుపై సంతృప్తిగా లేరు . ఇన్ని జరిగినా బీహార్ లో మహాకూటమికి ప్లాన్ చేసిన ప్రశాంత్ ఇక్కడా కాంగ్రెస్ ,ఎస్పీ మధ్య పొత్తుకు ప్రయత్నించారు .అఖిలేష్ కూడా అందుకు సై అన్నారు .. ప్రశాంత్ మ్యాజిక్ పనిచేస్తుందన్న టైం లో ములాయం ప్లేట్ తిరగేశారు .కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తే లేదన్నారు.దీంతో కాంగ్రెస్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.కేవలం పొత్తుల మీద ఆధారపడి ఎన్నికల వ్యూహరచన చేసిన ప్రశాంత్ అట్టర్ ప్లాప్ అయ్యాడు .
2014 ఎన్నికల్లో మోడీ గద్దె ఎక్కడంలో కీలక పాత్ర పోషించారని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఆ గెలుపుని భలేగా సొంతం చేసేసుకున్నారు .ప్రజా నిర్ణయాన్ని తానే మార్చేసినట్టు భావించారు.అయితే మోడీ ప్రభలో తనకు ఆ స్థాయి గుర్తింపు రావడం లేదన్న అసంతృప్తితో బీహార్ లో బీజేపీ ని ఢీకొట్టడానికి నితీష్ తో చేతులు కలిపారు . అక్కడా మహాకూటమి ఏర్పరిచి బీజేపీ ని ఓడించడంతో ఇక తనకు తిరుగులేదనుకున్నారు .పైగా బిహారీ అని గౌరవించి సలహాదారుగా నితీష్ నియమించినా దాన్ని గౌరవించిన దాఖలాలు లేవు .ఆ తర్వాత కాంగ్రెస్ ,వైసీపీ లతో ఒప్పందం చేసుకున్నాయూపీ లో ప్రశాంత్ కి అసలుసిసలు సవాల్ ఎదురైంది .తొలిసారిగా వ్యూహాలతోనే రాజకీయాలు ,ఎన్నికలు నెట్టుకురాలేమని అర్ధమైంది .ప్రజల అభిప్రాయాన్ని మలచకుండా పొత్తులు,ఎత్తులతో అన్ని చేయొచ్చనుకుంటే ఎదురు దెబ్బ తగిలింది .యువకుడు అఖిలేష్ ఎస్ అన్నాములాయం పొత్తులపై నో అనడంతో కాంగ్రెస్ పెద్దలకి ఏమి చెప్పాలో అర్ధం కాక ప్రశాంత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు .అయన మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ కూడా టెన్షన్ పడుతున్నాడు . ఔను మరి .మనకు నోరు వూరిందని చెట్టు మీద కాయ పండు అవుతుందా ?