ఆ ఊరికి బాబు,జగన్ చింత..

Posted February 17, 2017

jagan and chandrababu living with family in undavalli village ఉప్పు నిప్పు ఒక్క చోట చేరితే ఏమవుతుంది? చిటపటలు వస్తాయి.ఆ పక్కన ఉన్నవాళ్ళకి ఎంతోకొంత ఇబ్బంది తప్పదు. రాజధానికి భూములు ఇవ్వబోమని ఇప్పటికే కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉండవల్లివాసులకి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడేట్టు వుంది.ఇప్పటికే లింగమనేని గెస్ట్ హౌస్ లో సీఎం చంద్రబాబు ఉంటున్న విషయం తెలిసిందే.తాజాగా ప్రతిపక్ష నేత జగన్ సైతం అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.ఇందుకోసం ఓ స్థలాన్ని,ఇంకో భవనాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఎక్కడైనా ఒక ఊరి వాళ్ళు అనేది ఎవరినైనా కలిపే ఓ బంధం.కానీ ఇక్కడ ఒక ఊరి వాళ్ళు కాబోతున్నది రాజకీయ బద్ధ శత్రువులైన చంద్రబాబు,జగన్.

ఇక ఉండవల్లిని తీసుకుంటే ఎన్నికలప్పుడు కొద్దో గొప్పో హడావిడి తప్ప పెద్దగా ఇబ్బందులు,విబేధాలు లేని ఊరు.బాబు పుణ్యమా అని ఇప్పటికే కొన్నిసార్లు ఆ ఊరి జనం సెక్యూరిటీ సిబ్బందితో ఇబ్బంది పడుతున్నారు.జగన్ కూడా చేరితే ఆ ఇబ్బంది డబల్ అయిపోతుంది.అయినా ఫర్లేదు గానీ బాబు,జగన్ మధ్య వైరం తమ ఊరి వ్యవహారాలూ,రాజకీయాలు మీద పడకుండా ఉంటే చాలని ఉండవల్లి వాసులు కోరుకుంటున్నారు.ఓ ఊరి వాళ్ళు అయ్యాకైనా బాబు,జగన్ వ్యవహారశైలి అందుకు తగ్గట్టు ఉంటుందో ..లేక ఉండవల్లి ప్రజలు భయపడినట్టు అవుతుందో చూడాలి.

SHARE