మాట మార్చిన చంద్ర‌బాబు, వెంక‌య్య‌… జ‌గ‌న్

  jagan angry chandrababu venkaiah naidu eluru yuva bheri meeting

ఏపీ కి ప్ర‌త్యేక హోదా గురించి చంద్ర‌బాబు నాయుడు కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు మాట‌లు మార్చి ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దారి ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరికి విలువ‌లు లేవు. విశ్వ‌స‌నీయ‌త లేదు. . ఎన్నిక‌ల‌దాకా హోదా అన్న పెద్ద మ‌నుషులు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత హోదాను విస్మ‌రించారు.హోదా ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ బీజేపీ కాళ్లు ప‌ట్టుకుని వేలాడుతున్నారు చంద్ర‌బాబు. అందుకో కార‌ణం ఉంది. ఆయ‌న ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. స్వార్థం కోసం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను వెన్నుపోటు పొడిచారు. హోదాపై బీజేపీ టీడీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారాన్ని ప్రారంభించారు

-ఆర్థిక వ‌న‌రుల‌ను ఆయా రాష్రాల‌కు పంప‌కం చేసే ప‌ని ఆర్థిక సంఘానిది. కేంద్రం వ‌సూలు చేసే ప‌న్నుల‌లో ఏ మేర‌కు రాష్ట్రాల‌కు ఇవ్వాల‌న్న అంశాన్ని సూచిస్తుంది. రాష్ట్రాల‌కిచ్చే ప‌న్నుల‌ను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందీ సంఘం.. రాష్ట్రాల రెవిన్యూ లోటును పూడ్చాల‌ని క‌మిష‌న్ చెప్పింది. ఆర్థిక సంఘం హోదా గురించి ప్ర‌స్తావించ‌లేదు. హోదా ఉండ‌ద‌ని గానీ ఇత‌ర అంశాల‌ను గానీ ప్ర‌శ్నించ‌లేదు ఆర్థిఒక సంఘం. .ఆర్థిక సంఘం హోదాను ర‌ద్దు చేయాల‌ని ఎన్న‌డూ సిఫార్సు చేయ‌లేద‌ని సంఘ స‌భ్యుడు అభిజిత్ సేన్ కూడా ప్ర‌క‌టించారు. హోదా రాష్ట్రాలు కొన‌సాగుతాయ‌ని కేంద్ర మంత్రి అధికార పూర్వ‌కంగా ప్ర‌క‌టించారు.

SHARE