ఫొటోలతో జవాబిచ్చిన జగన్…

గళ్ళచొక్కా ముదురు రంగు ప్యాంట్… మొహం మీద నవ్వు.. జోడించిన చేతులు.. వైస్ జగన్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే ఫీచర్ ఇది…కానీ ఆయన వేషం మారింది…ఎప్పుడు?ఎక్కడ అంటారా?ఇక్కడ కాదులెండి ….బ్రిటన్ లో…ఆయన తో కలిసి అభిమానులు తీసుకొన్న సెల్ఫీలు కొన్ని…జీన్స్ టీషర్ట్ లో తెలుగు సినీ హీరోలా గోల్ఫ్ ఆట ఆడుతున్న చిత్రాలు కొన్ని సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.విదేశీ పర్యటనకెళ్ళిన జగన్ టూర్ వివరాల్ని దాదాపు రహస్యంగా ఉంచేశారు….ఆయనెక్కడికివెళ్ళారో?ఎందుకు వెళ్లారో అని టీడీపీ నేతల ప్రశ్న మొదలు కాగానే ఈ ఫోటో లు బయటకొచ్చాయి…ఆ ప్రశ్నలకు ఇవి జవాబులేమో?

Leave a Reply