బాబు చిత్త శుద్ధికి జగన్ ప్రశంస ..

  jagan appreciated chandrababu intelligence

ఉప్పు నిప్పులా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రశంసలు కురిపించారు. అదికూడా ysr వర్ధంతి సభ తర్వాత.. ఇదెలా సాధ్యం అని ఆలోచించకండి సాధ్యమైంది. ఓటు కు నోటు అదేలెండి.. జగన్ గారి మాటల్లో చెప్పాలంటే ‘ఓటుకు కోట్లు కేసు.. దాన్నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్త శుద్ధి తో ప్రయత్నిస్తున్నారని జగన్ మెచ్చుకున్నారు’ ఆ మెచ్చుకోవడంలో ఉన్న సెటైర్ అర్ధం చేసుకోలేనంత అమాయకుడు ఏమి కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఏదేమైనా రివర్స్ గేర్ లో అయినా బాబు చిత్త శుద్ధిని మెచ్చుకున్న జగన్ ని చూస్తుంటే .. ఆయనలో ఇంత హాస్య చతురత ఉందా అని వైసీపీ శ్రేణులే ఆశ్చర్య పోతున్నారు. ఇది రాజకీయం కదా! ఎలాంటి వారికైనా పాఠాలు నేర్పుతుంది. ఎవరిని ఎలాగైనా మారుస్తుంది.

SHARE