కెసిఆర్ ని పొగిడిన జగన్ ..దాడికి దేశం సిద్ధం

September 22, 2016 jagan appreciated kcr eluru meeting tdp politicians ready giving counter attack
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సాకులు చూపినా పోరాడితే ప్రత్యేక హోదా సాధ్యమేనని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు.అందుకు ఉదాహరణగా తెలంగాణ అంశాన్నే ప్రస్తావించారు.అసాధ్యం అనుకున్న తెలంగాణ కెసిఆర్ పోరాటం తో సాధ్యమైందని జగన్ చెప్పుకొచ్చారు.అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యల పై టీడీపీ దుమ్మెత్తిపోసే అవకాశాలున్నాయి.

2014 ఎన్నికల సమయంలో కెసిఆర్,జగన్ మధ్య సంబంధాలున్నాయని టీడీపీ విస్తృత ప్రచారం చేసింది.విభజనకి జగన్ అనుకూలంగా వ్యవహరించారని కూడా ఆరోపించింది.వాటికి బలం చేకూర్చేలా పోలింగ్ ,ఫలితాల మధ్య కెసిఆర్ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణాలో తాను,ఏపీ లో జగన్ గెలుస్తామని అయన అన్నారు.అందులో సగమే నిజమైంది.జగన్ పరాజయం పాలైనా కెసిఆర్ తో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారని టీడీపీ అనుమానిస్తోంది.ఓటుకునోటు కేసులో కీలకమైన ఎమ్మెల్సీ స్టీఫెన్ కూడా జగన్ అనుచరుడన్న సందేహాలున్నాయి.ఈ పరిస్థితుల్లో జగన్ వ్యాఖ్యలపై మరోసారి టీడీపీ దాడికి దిగే అవకాశాలు మెండుగా వున్నాయి .

SHARE