జగన్ కొంచెం ఆలోచించు..

0
760
jagan be focus on chandrababu naidu not lokesh

 Posted [relativedate]

jagan be focus on chandrababu naidu not lokesh
ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ కి ఓ యోధుడిగా ఎంత పేరు వచ్చిందో..ఆయనని ఒక్క యుద్ధం లో ముప్పుతిప్పలు పెట్టిన పురుషోత్తముడికి వీరుడిగా అంత పేరు దక్కింది.యుద్ధంలో గెలవకపోయినా దిగ్గజాన్ని గట్టిగా ఢీకోట్టినవాడికి జనం జేజేలు కొడతారనడానికి ఇదో నిదర్శనం.రాజకీయాల్లో కూడా ఇదే సూత్రం పని చేస్తుంది.అందుకే కాంగ్రెస్ లాంటి దిగ్గజాన్ని ఢీకొట్టి జగన్ కొత్త పార్టీ పెట్టినపుడు..జనం ఆయన్ని ఆశీర్వదించారు.ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు కనీస గౌరవం లేకుండా చేసారు.మళ్లీ కాంగ్రెస్ కి లోపాయికారీగా మాట్లాడుకుని విభజనకి సహకరించారన్న ఆరోపణలు రాగానే నెలల వ్యవధిలో ఆయన్ని పక్కన పెట్టారు.ఈ రెండు అనుభవాలు చూసిన జగన్ కి ఒకటి అర్ధం కావాలి.గట్టి ప్రత్యర్థి మీద ఓడినా గెలిచినా దానికో విలువుంటుందని.కానీ జగన్ ఈ విషయాన్ని తలకెక్కించుకున్నట్టు లేదు.

jagan be focused on chandrababu naidu not lokesh
ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఓ దిగ్గజం.అయన మీద పోరాడితే జగన్ యోధుడవుతాడు.కానీ 2014 ఎన్నికల అనుభవం చూసి కాబోలు జగన్ యుద్ధ వ్యూహం మార్చుకున్నాడు.తాజాగా టీడీపీ భావినేత లోకేష్ ని టార్గెట్ చేయడం,ఆయనకి తనకి మధ్య ప్రజల్లో పోలిక వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకోవడం ఎక్కువైంది .దీనివల్ల జగన్ ప్రత్యర్థి లోకేష్ అనే భావం ప్రజల్లో పెరుగుతోంది.అంతకుముందు ఎంత ప్రయత్నించినా లోకేష్ వల్ల కానిపని జగన్ చేసిపెట్టాడు.జగన్ తప్పుడు వ్యూహం వల్ల లోకేష్ ఆయనకి సమఉజ్జిగా ఎదుగుతుంటే ..చంద్రబాబు కి జగన్ పోటీకాదా అనే పరిస్థితి తలెత్తింది.ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరిస్తే మేలు.బలహీన ప్రత్యర్థిని ఎంచుకోవడం కన్నా బలమైన శత్రువుని ఢీకొట్టడమే సరైన యుద్ధ వ్యూహం అవుతుంది …కొంచెం ఆలోచించుకో జగన్

Leave a Reply