ఆ మీడియా మేనేజ్ మెంట్ లో జగన్ బెటర్..

Posted September 26, 2016

 jagan better than chandrababu media management
మీడియా మేనేజ్ మెంట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అందరికంటే ముందుంటారని ప్రత్యర్ధులు సైతం ఒప్పుకుంటారు.మెచ్చుకుంటారు ..విమర్శిస్తారు. పత్రికలు,చానెల్స్ దగ్గరికొస్తే ఈమాటలో నిజముందేమో! కానీ మీడియా రూపం మారుతున్న అంశం బాబుఅండ్ కో పెద్దగా పట్టించుకున్నట్టు లేదు.ప్రతి విషయానికి సాంకేతిక నైపుణ్యం గురించి చెప్పే బాబు సోషల్ మీడియాని వాడుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు.అక్కడ జగన్ ముందడుగు వేస్తున్నారు.ఇప్పుడు తెలుగులో పత్రికలకి సంబంధించిన వెబ్ సైట్స్ మినహా మిగిలిన రాజకీయ,సినీ సంబంధిత వెబ్ సైట్స్ లో ఎక్కువ శాతం చంద్రబాబుని విమర్శించేవే.తెలుగు వెబ్ సైట్స్ లో ఇప్పుడు ప్రముఖంగా వున్న రెండు వ్యాపారపరంగా పోటీపడుతూనే జగన్ దగ్గరికొచ్చేసరికి ఒకే మాటపై ఉంటున్నాయి.ఒంటికాలు మీద బాబుని ఏకిపారేస్తున్నాయి.అందుకు ప్రతిగా ఏదో ప్రయోజనం వైసీపీ నుంచి అందుతున్నట్టు సమాచారం.ర్యాంకులతో సంబంధం లేకుండా కాస్త జనాల్లోకి వెళుతున్న అన్ని వెబ్ సైట్స్ తోటి వైసీపీ టీం ఒకటి టచ్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

రాబోయే ఎన్నికల నాటికి వెబ్ సైట్ వార్తల ప్రభావం పెరగొచ్చని జగన్ భావిస్తున్నారు.అందుకే సోషల్ మీడియాలో తన అనుకూలురు ఎక్కువమంది ఉండేలా ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారు.ఇటీవల ఓ జర్నలిస్ట్ పాత పరిచయం తో సాక్షిలో ఉద్యోగం ఇప్పించమని జగన్ ని కలిశారట.వెంటనే సొంతంగా ఓ వెబ్ సైట్ పెట్టుకోండి ..సాయం చేస్తానని జగన్ మాటిచ్చారట.సాక్షి ప్రత్యర్థి పత్రికల నుంచి బయటకొచ్చిన కొందరు జర్నలిస్టులు కూడా వైసీపీ అండతో వెబ్ సైట్స్ నడుపుతున్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని చంద్రబాబు అండ్ కో చూసీచూడనట్టు ఉదాసీనంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో దానికి తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.

SHARE