ఇద్దరు చంద్రులు..మధ్యలో జగన్

    jagan between kcr chandrababu athome

 

 

 

 

 

 

 

 

 

    jagan between kcr chandrababu athome

 

 

 

 

 

 

 

 

 

 

 

 

    jagan between kcr chandrababu athome

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2016…ఆగష్టు 15 ..హైదరాబాద్ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ..అంతటా నవ్వులు,కరచాలనాలు,పలకరింపులు …గవర్నర్ నరసింహన్ అందర్నీ ఉత్సాహంగా రిసీవ్ చేసుకుంటున్నారు.కానీ అందరి దృష్టి రాబోయే ఆ ముగ్గురి మీదే వుంది.తెలుగు రాష్ట్రాల రాజకీయ వీరులు …ఇద్దరు ముఖ్యమంత్రులు ..ఓ ప్రతిపక్ష నేత…ఎన్.చంద్రబాబునాయుడు ,కె.చంద్రశేఖరరావు,వై.ఎస్ .జగన్ మోహన్ రెడ్డి ..

ఈ ముగ్గురు ఒకే చోట కలవడం బహు అరుదు ..అందుకే వచ్చిన వాళ్లంతా ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.రిపీట్ అయినా ఇంటరెస్టింగ్ సన్నివేశం …ముఖ్యమంత్రులు …ఇద్దరు చంద్రులు ఎదురు పడ్డారు.మనుషులు కలిసారుగానీ మనసుల మధ్య దూరం తగ్గలేదని మొక్కుబడి పలకరింపులకే పరిమితమైన వాళ్ళని చూస్తే అర్ధమైంది.ఆసక్తిగా చూసిన వారి కళ్ళలో నిరుత్సాహం..ఇంతలో మరో కీలక సన్నివేశం..యువనేత జగన్ ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎదురుపడే సీన్ ..కేసీఆర్ ….జగన్ ఇద్దరి మధ్య పలకరింపులు ఎపిసోడ్ బాగానే సాగింది.ఇక బాబు …జగన్ వంతు …మొక్కుబడి నమస్కారాలతో ఫినిష్ అవబోయింది..ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి చొరవతో సీన్ షేక్ హ్యాండ్ దాకా వచ్చింది.

మొత్తానికి ముగ్గురు నేతల ముఖాముఖి అలా పూర్తి అయిపోయింది .ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా వుండే జగన్ రావడం హైలైట్ అయ్యింది …కానీ బాబుతో,కేసీఆర్ తో భిన్నంగా వ్యవహరించిన అయన తీరు మరో చర్చకి బీజం వేసింది.ఈ నేపథ్యంలో దేశం …పాత ఆరోపణల్ని కొత్తగా సంధించడం ఖాయంగా కనిపిస్తోంది

SHARE