హైదరాబాద్ కి జగన్ గుడ్ బై..కెసిఆర్ వల్లేనా?

Posted October 12, 2016

   jagan built house  amaravathi living purpose because kcr
శత్రువుకి శత్రువు మిత్రుడు…ఈ సూత్రం ఆధారంగానే చంద్రబాబుకి వ్యతిరేకంగా కెసిఆర్, జగన్ చెట్టాపట్టాలేసున్నారు.నాకో కన్ను పోయినా పర్లేదు..పక్కోడికి రెండు కళ్ళు పోవాలన్నట్టు హైదరాబాద్,తెలంగాణ రాజకీయాల నుంచి బాబు దూరం కాగానే కెసిఆర్ కన్నా జగన్ ఎక్కువ సంబరపడ్డారు.అదే ఇప్పుడు జగన్ కొంప ముంచింది.ఇక టీడీపీ తో తెలంగాణ తో ప్రమాదం లేదని నమ్మకం కుదిరాక కాంగ్రెస్ ని కెసిఆర్ టార్గెట్ చేశారు.అయితే సామాజికంగా బలమైన రెడ్ల నుంచి కాంగ్రెస్ రూపంలో గట్టి నిరోధమే కనిపించింది.దీంతో కెసిఆర్ వారిని ఎదుర్కోడానికి ఇన్నాళ్లు టీడీపీ కి అండగా వుంటూ వచ్చిన కమ్మల్ని దగ్గరకు తీసే పని మొదలెట్టాడు.సహజంగానే జగన్ తో సాన్నిహిత్యం వల్ల ఆ ప్రయత్నాలు ఫలించవని అంచనా వేసిన కెసిఆర్ ఆయన్ని దూరం పెట్టడానికి డిసైడ్ అయ్యారంట.తెలంగాణ లో వై.ఎస్ అభిమానులు కాంగ్రెస్ కి అండగా నిలవడం కూడా కెసిఆర్ నిర్ణయానికి మరో కారణం.

హైదరాబాద్ లోబాబు కి జరిగిందే తనకు జరగొచ్చన్న అనుమానంతో జగన్ ఏపీ లో నివాసం ఏర్పాటు చేసుకోడానికి సంకోచిస్తున్నారు.ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే టీడీపీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది.పోనీలే హైదరాబాద్ లో వుందామనుకుంటే టీ కాంగ్రెస్ దూకుడు వల్ల కెసిఆర్ దూరం పెడుతున్నారు .దీంతో హైదరాబాద్ కి గుడ్ బై కొట్టే ఆలోచనను జగన్ క్యాంపు సీరియస్ గా పరిశీలిస్తోంది.అయితే ఆంధ్రాకి వెళదామంటే ఇంటలిజెన్స్ భయం.దీంతో జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది.ఇలాంటివి ఊహించే కాబోలు పెద్దలు చెరపకురా చెడేవు అని హెచ్చరించింది.

SHARE