Posted [relativedate]
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నుంచి పాజిటివ్ సిగ్నల్ వస్తే.. ఏ పార్టీ అయినా ఎగిరి గంతేస్తుంది. ఒకవేళ లాభముంటే… దోస్తీ కట్టేస్తుంది. కుదిరితే డైరెక్ట్ గా.. కుదరకపోతే తెరవెనుక నుంచైనా మంత్రాంగం నడిపిస్తుంది. కానీ ఎందుకనో అలాంటి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినా వైసీపీ కూడా లైట్ తీసుకుంటోంది. కలిసి పని చేద్దామంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్ ఇస్తే… దానిపైనా జగన్ కు ఎక్కడా లేని డౌట్స్ వస్తున్నాయి.
ప్రత్యేక హోదా విషయంలో ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ పవన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ ఆఫర్ వైసీపీకేనని ప్రచారం జరిగింది. కానీ జగన్ మాత్రం పవన్ పై లేని పోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ- బీజేపీయే … పవన్ ను తెరపైకి తెచ్చాయేమోనన్న డౌట్ జగన్ కు ఉందట. ప్రత్యేక హోదా పోరును పక్కదారి పట్టించడానికే కేంద్రపెద్దలు, చంద్రబాబు కలిసి ఇలా చేయిస్తున్నారని జగన్ భావిస్తున్నారట. పవన్ స్టార్ కేంద్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి… చంద్రబాబుపై నోరెత్తకపోవడం కూడా ఓ కారణమని తెలుస్తోంది. అందుకే పవన్ తో మంతనాలు జరపడానికి కూడా వైసీపీ వెనుకాడుతోందని టాక్.
నిజానికి జనసేనాని నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రాగానే జగన్ నుంచి రియాక్షన్ ఉంటుందని అందరూ భావించారు. జగన్ తరపున వైసీపీ నుంచి కొందరు నాయకులు వెళ్లి పవన్ తో భేటీ అవుతారని కూడా ప్రచారం జరిగింది. లాస్ట్ మినిట్ లో ఈ మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. జగన్ కు డౌట్ రావడం వల్లే ఇలా జరిగిందని వైసీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా జగన్ ఈ అనుమానాలను కట్టిపెట్టకపోతే అది పార్టీకి పెద్ద దెబ్బేనంటున్నారు వైసీపీ నాయకులు.