జోస్యం తర్వాత జగన్ మార్పులు.. చేర్పులు..

jagan changes party positionsజ‌గ‌న్ పార్టీలో ఖాళీలు భ‌ర్తీ అవుతున్నాయి. ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఏమాత్రం బాగోక‌పోవ‌డంతో ఇటీవ‌ల జోస్యం చెప్పించుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. తాజాగా పార్టీ నేత‌ల్లో కొంద‌రికి స్థానం చ‌ల‌నం క‌లిగించి, మ‌రికొంద‌రికి నియామ‌కాలు ఇస్తున్నారు. అప్పుడైనా పార్టీ ప‌రిస్థితి బాగుంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తాజా నియామ‌కాల విష‌యానికి వ‌చ్చేస‌రికి..

సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులోని తంబ‌ళ్ల‌పల్లిలో పార్టీ వ్య‌వ‌హారాలు చూస్తున్న  మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి కి జ‌గ‌న్ చెక్ పెట్టారు. బ‌హుశా జ‌గ‌న్ ఆశిస్తున్న మేర‌కు ఆయ‌న అక్క‌డ ప‌నిచేయ‌ట్లేద‌ని స‌మాచారం. దీంతో పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డిని తంబళ్లపల్లెకు ఇన్ చార్జీగా  నియమించారు.  మ‌రి ఈయ‌న ఎంత‌వర‌కు జ‌గ‌న్‌ను మెప్పిస్తారో చూడాలి.అదేవిధంగా క‌ర్నూలు జిల్లా  బాధ్య‌త‌ల‌ను మైనార్టీ నేత  హపీజ్ ఖాన్ కు అప్ప‌జెప్పారు. ఇక్క‌డ  ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి.. ఇటీవ‌ల టీడీపీ అధినేత విసిరిన ఆక‌ర్ష్ దెబ్బ‌కు సై అంటూ సైకిలెక్కేశారు.

దీంతో ఈ జిల్లాలో  పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింది. ఈ క్ర‌మంలో పార్టీకి తిరిగి పూర్వ‌వైభ‌వం తీసుకురావాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే హ‌ఫీజ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని అంటున్నారుక‌ర్నూలు న‌గ‌రంలో ఉన్న మైనార్టీ నేత‌ల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ ఆవ‌ర్గానికే చెందిన హ‌ఫీజ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గానికి నవీన్ బాబును కొత్త ఇన్ చార్జీగా పెట్టారు జ‌గ‌న్‌. ఇక్క‌డ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాల రాజేష్‌కుమార్ పార్టీలో యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

దీంతో న‌వీన్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. నంద్యాల నియోజకవర్గంలో రాజగోపాలరెడ్డిని బాధ్యుడిగా ప్రకటించారు. ముమ్మడివరానికి పితాని బాలకృష్ణను సమన్వయకర్తగా నియమించారు. అంతా బాగానే ఉంది. వెళ్లిన‌వారు పోగా ఉన్న వారికి జిల్లా ప‌ద‌వులైనా ద‌క్కాయ‌ని అనుకుంటున్నారు కింద స్థాయి నేత‌లు. మ‌రి భ‌విష్య‌త్తులో వీరి ప‌ని ఏవిధంగా ఉంటుందో.. జ‌గ‌న్‌ను వారు ఎలా సంతృప్తి ప‌రుస్తారో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here