జగన్ ఇక తప్పించుకోలేరు..

Posted October 4, 2016

 jagan coming amaravathi confirm
అమరావతి ..ఆంధ్రుల ఆశలు,ఆశయాలు,కలలు దాని చుట్టూనే అల్లుకుని వున్నాయి.వాటిని పెంచిపోషించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంతు ప్రయత్నం సాగిస్తున్నారు.ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఆదినుంచి అమరావతి పట్ల అంత సానుకూల ధోరణి ప్రదర్శించలేకపోతున్నారు.శంకుస్థాపన నాటి నుంచి అదే వ్యవహారశైలి.ఆ తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి వివిధ కోర్టుల్లో కేసులు వేసినవాళ్లంతా జగన్ మద్దతుదారులనేది బహిరంగ రహస్యమే.కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్ల తరువాత ఉద్యోగులు వెలగపూడి వచ్చేశారు.తాత్కాలిక సచివాలయంలో విధుల నిర్వహణకు ఎన్ని ఇబ్బందులున్నా తరలి వచ్చారు. ఇక సీఎం చంద్రబాబు ఉండవల్లిలో అంతకు ఏడాది ముందు నుంచే మకాం వేశారు.

ఈ విషయంలో వెనుకపడింది ప్రతిపక్ష నేత జగన్.మంగళగిరి పరిసరప్రాంతాల్లో నివాసం కోసం జగన్ సన్నిహితులు స్థలం,భవనం కోసం వెదుకుతున్నట్టు ఇప్పటికి చాలా సార్లు వార్తలొచ్చాయి.అవి చివరకు వార్తలు గానే మిగిలిపోయాయి.అంతకు మించి ముందుకు కదల్లేదు.ఇప్పుడు ఉద్యోగుల రాకతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొత్తరాజధానిలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం,స్పీకర్ పట్టుదలగా వున్నారు. అదే జరిగితే ఇక జగన్ ఎట్టి పరిస్థితుల్లో అమరావతికి రాకుండా తప్పించుకోలేరు.పైగా అంతా ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ లో జగన్ ఒక్కరే ఉంటే జరిగే రాజకీయ నష్టం గురించి వేరే చెప్పక్కర్లేదు.ఇప్పటిదాకా ఈ విషయం మీద దృష్టి పెట్టని టీడీపీ నేతలు ఇక దాన్ని హై లైట్ చేయబోతున్నారట .ఎటు నుంచి చూసినా అమరావతి రాకుండా జగన్ తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

SHARE