జగన్ మనసంతా కుర్చీకోసం..మరి బాబుకు ?

Posted December 20, 2016

       jagan concentration on cmchair and babu onఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగనమోహన్ రెడ్డి మనసంతా కుర్చీకే అంకితం అయ్యిపోయింది అని తెలుగు దేశం పార్టీ నాయకులు అనుకొంటున్నారు.జన చైతన్య యాత్రల్లో భాగం గా ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్య క్రమాల్లో వాళ్ళు ఈ తరహా ప్రసంగాలను ఇస్తున్నారు..వీళ్ళ మాటల్ని విమర్శనాత్మక ధోరణిలో చూద్దాం..అవును అధికారం కోసం అర్రులు చాచడం తప్పా?ఇప్పుడు అధికారం లో ఉన్న మీరు పదేళ్ల పటు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్షం లో కూర్చోలేదా ఆనాడు ముఖ్య మంత్రి గా ఉన్న రాజశేఖర రెడ్డి బాబు ని అసెంబ్లీ లో ఎంత మాటన్నారో గుర్తు లేదా.. మీకు దొరిన ఏ ఛాన్స్ ని అయినా వదిలారా? విమర్శలు చేయలేదా..

అంతెందుకు అధికారం లేక మీ నాయకుడు చంద్రబాబు ముఖం కళా విహీనం గా తయారవ్వ లేదా..సరే గతం గతః ఇప్పుడు మాత్రం మీరు చేస్తున్నది ఏమిటి గురివింద చందం కాదా? హామీలు నిలబెట్టుకోలేదని ప్రజల్లో అసహనం వుంది అనే విషయం అసలు మీ నాయకుడి వరకు వచ్చిందా? ప్రతిపక్షం వాళ్ళు అన్నారని కాదు కానీ అధికారం లోకి వచ్చి దాదాపు 32 నెలలు కావస్తోంది ఏమి చేసారో చెప్ప గలరా (రాజధాని నిర్మాణము మినహా ) రైతు రుణ మాఫీ అన్నారు చేసారా ..మేనిఫెస్టో లో హామీలన్నీ అలానే ఉన్నాయి..ఇవన్నీ మీ తప్పులు కాదా ప్రతిపక్షం పని బొక్కలు వెతకడమే అని మీకుతెలియదా అధినేత కు భజన మాని నిజాన్ని చూడాల్సిన అవసరం ఉంది ..నిన్నటికి నిన్న మీడియా ఏదైనా సరే వైసిపి కి ఫలానా చోట లోపం వుంది అని చెప్పగానే వాళ్ళు రంగంలో కి దిగి తప్పులు సరిదిద్దుకో లేదా? మీకు లేదా కుర్చీ మీద ఆశ.. ఒక వైపు ముద్రగడ ఉద్యమం అంటూ అయన సామాజిక వర్గాన్ని తెలుగుదేశానికి వ్యతిరేకం చేసుకొస్తున్నాడు ..ప్రత్యామ్నాయం ఏమి చేసారు కాపులకి కేవలం కార్పోరేషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటే సరిపోతుందా తెలుగుదేశం లో కాపుల్లేరా వాళ్లకేం చేత కాదా ముద్రగడ కి పోటీ ఇవ్వలేరా? ప్రభుత్వం మీది చిత్త శుద్ధి ఉంటే ప్రజల్లో అసంతృప్తి ముదరక ముందే కళ్ళు తెరచి మరో సారికి కుర్చీ కాపాడుకోండి లేదంటే మీరు నెక్స్ట్ టైం జగన్ లాగే కళ్ళుమూసుకోవాల్సి ఉంటుంది …

SHARE