పాదయాత్ర అయినా జగన్ ని మారుస్తుందా?

 Posted November 1, 2016

jagan decided to do padayatra
మనుషులు మారడం సహజం.అయితే అందుకు తగిన సందర్భం,అనుభవం రావాలి.ఆ టైం ఒక్కోరి జీవితంలో ఒక్కో విధంగా ఉంటుంది.దివంగత నేత వై.ఎస్ .రాజశేఖర్ రెడ్డి నే తీసుకుందాం.ఆయనకి 2004 లో ముఖ్యమంత్రి పీఠం దక్కింది.అంతకు 20 ఏళ్ల ముందే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఓ మాట చెప్పారు..’నీలో మంచి నాయకత్వ లక్షణాలున్నాయి.కోపాన్ని తగ్గించుకుంటే రాజకీయాల్లో రాణిస్తావు’..పీసీసీ పగ్గాలు అప్పగిస్తూ ఆమె చెప్పిన మాటలు ఆచరించడానికి ఆయనకి 15 ఏళ్ల సమయం పట్టింది.1999 ఓటమి తరువాత మాత్రమే ఇందిర మాటల శక్తి ఆయనకి అర్ధమైంది.అప్పటిదాకా నడిపిన అసమ్మతి రాజకీయాలు ఓ సెక్షన్ లో హీరో వర్షిప్ తెచ్చాయిగానీ విజయం అందించలేకపోయాయి.అప్పుడు దారి మార్చుకోవాలని వై .ఎస్ కి అర్ధమైంది కానీ పాదయాత్ర మొదలయ్యాకే ఏ దారిలో వెళ్ళాలో ఆయనకి స్పష్టత వచ్చింది.అందుకే వై.ఎస్ స్వయంగా పాదయాత్రలో నా కోపమనే నరం తెగిపోయిందని చెప్పుకున్నారు.ఆ తర్వాత ఆయనకి వచ్చిన విజయాలు అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే …జగన్ కూడా తండ్రి బాటలో పాదయాత్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.అయితే అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.సహజంగానే ఈ వార్త వైసీపీ శ్రేణులకు సంతోషం కలిగిస్తోంది.పాదయాత్ర తర్వాతైనా తమ నాయకుడి వ్యవహారశైలి మారుతుందని,విజయాలు పలకరిస్తాయని వారి ఆశ.చూద్దాం ఏమి జరుగుతుందో?

SHARE