ఇప్పుడు జగన్ వంతు …

jagan delhi tour

పుష్కర ఆహ్వానం పేరిట ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ సహా కేంద్ర పెద్దలని కలిసి హోదా అంశాన్ని ప్రస్తావించారు.హోదా ఏమోగానీ ప్యాకేజీ ఓకే అయ్యేట్టుంది .ఈ పరిస్థితుల్లో హోదా డిమాండ్ తో పోరాడుతున్న వై.ఎస్.జగన్ హస్తిన టూర్ పెట్టుకున్నారు .,ప్రత్యేక హోదా అంశంపై విపక్ష నేత జగన్ రాష్ట్రపతిని కలవబోతున్నారు.డిల్లీలో పార్టీ పార్లమెంటు సభ్యులతో కలిసి జగన్ సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ఇదే అంశంపై మరికొన్ని జాతీయ,ముఖ్యమైన పార్టీ నేతలను కూడా జగన్ కలుస్తారు.. చంద్రబాబుకు పోటీగా జగన్ ఇప్పుడు తన డిల్లీ యాత్ర చేస్తున్నారు.ప్రత్యేక హోదా ఎపికి పెద్ద సెంటిమెంటుగా మారిన నేపద్యంలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే జగన్ షెడ్యూల్ లో హోదా ఇవ్వాల్సిన వాళ్ళతో సమావేశాలు లేవు .అంటే ఈ టూర్ వినతులకా ?ఫిర్యాదులకా ?

SHARE