బాబుకి సవాల్ ..వెంకయ్య సై..జగన్ షాక్

Posted September 27, 2016

 jagan demand chandrababu package details venkaiah counter
చర్యకు సమానమైన ప్రతి చర్య అనే న్యూటన్ మూడో సూత్రం ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణ అంశం.అయితే ఈసారి ఆ సూత్రం కాస్త రూట్ మార్చుకుంది.ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ అధినేత చంద్రబాబు మీద దాడి పెంచారు.ఓటుకునోటు కేసు నుంచి తప్పించుకునేందుకే అయన రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ప్యాకేజ్ కి ఒప్పుకున్నారని జగన్ ప్రచారం సాగిస్తున్నారు.పనిలో పనిగా కేంద్రమంత్రి వెంకయ్యని ఎటాక్ చేశారు.వైసీపీ నేతలు హోదా,ప్యాకేజ్ వీటిలో ఏది మేలు అన్న అంశంపై జగన్ తో బహిరంగ చర్చకి రావాలని బాబుకి ఛాలెంజ్ చేశారు.

ప్యాకేజ్ ప్రకటన దాకా రాష్ట్ర వ్యవహారాలపై ఆచితూచి స్పందించే వెంకయ్య ఈసారి రూట్ మార్చారు.పవన్,నారాయణ,జగన్ …అందరు తననే టార్గెట్ చేయడంతో వెంకయ్య ఎదురుదాడి స్టార్ట్ చేశారు.సాధ్యమైనంత ఎక్కువ టైం ఇక్కడే ఉంటున్న వెంకయ్య తాజాగా మరో స్టాండ్ తీసుకున్నారు.బాబుకి వైసీపీ సవాల్ చేస్తే ..తనతో ప్యాకేజ్ వ్యవహారంపై చర్చకి రావాలని వెంకయ్య కౌంటర్ సవాల్ విసిరారు.ఈ పరిణామం ఊహించని వైసీపీ కంగారుపడుతోంది.అందుకు వెంకయ్య మాటకారితనం మాత్రమే కారణం కాదు.వెంకయ్య ద్వారా కేంద్రం కన్ను తన మీద పడితే ఆర్ధిక అవకతవకలకు సంబంధించి ఈడీ జోరు పెరుగుతుందని జగన్ భయపడుతున్నారట.అలా అని మొదలు పెట్టిన పోరాటం ఆపితే జనానికి ఏమి చెప్పగలరు? మొత్తానికి పాత కేసులు జగన్ ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నాయి.

SHARE