తొడగొట్టి పారిపోతున్న జగన్?

0
465
jagan demand judicial enquiry on prathipati pulla rao in ap assembly

 Posted [relativedate]

jagan demand judicial enquiry on prathipati pulla rao in ap assembly
అసలే హాట్ హాట్ గా నడుస్తున్న ఏపీ అసెంబ్లీ హీట్ ని ఇంకాస్త పెంచిన విషయం అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద వైసీపీ ఆరోపణలు. మంత్రి అక్రమంగా అగ్రి గోల్డ్ ఆస్తులు కొన్నాడని జగన్ ఆరోపించాడు.దీనిపై హౌస్ కమిటీ తో విచారణ వల్ల ఏ ప్రయోజనం ఉండదని చెప్పిన జగన్ జ్యూడిషియల్ విచారణకు డిమాండ్ చేశారు. అలా Chester పుల్లారావు అక్రమాలు బయటపడతాయని అన్నాడు.ప్రభుత్వానికి జ్యూడిషియల్ విచారణ జరిపే ధైర్యముందా అని సవాల్ విసిరాడు.అక్కడే జగన్ పప్పులో కాలేశాడు.వెంటనే జ్యూడిషియల్ విచారణకు సిద్ధమని సర్కార్ ప్రకటించింది.

సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేయగానే జగన్ దాన్ని స్వాగతించాలి . జ్యూడిషియల్ విచారణతో నిజాలు బయటికి వస్తాయని హర్షం వ్యక్తం చేయాలి.కానీ ఈ రెండూ జరగలేదు.చేసిన డిమాండ్,ప్రభుత్వ సంసిద్ధత గురించి వదిలిపెట్టి సభలో తమకు మాట్లాడే అవకాశం ఇస్తే పుల్లారావు అక్రమాలపై సాక్ష్యాలు ఇస్తామని వాదించడం మొదలెట్టారు.అందుకోసం ఓ ఇరవై నిమిషాలు టైం అడిగాడు .దీంతో వైసీపీ సభ్యులు అయోమయంలో పడిపోయారు.జగన్ అడిగినదానికి ప్రభుత్వం ఒప్పుకున్నా ఇలా డిఫెన్స్ లోకి ఎందుకు వెళ్ళాడో వారికి అర్ధం కాలేదు.ఇదే అదనుగా అధికార పక్షం రెచ్చిపోయింది.చేసిన అసత్య ఆరోపణలకు క్షమాపణ చెబుతారా లేక జ్యూడిషియల్ విచారణకు సిద్ధపడతారా? శరణమా..రణమా ? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు దూకుడుగా ప్రశ్నిస్తుంటే జగన్ అచేతనంగా ఉండిపోయారు.ఈ వ్యవహారం చూసి మండిపోయిన ఓ సీనియర్ రాజకీయ వేత్త,వైసీపీ ఎమ్మెల్యే ..తొడగొట్టి పారిపోవడమంటే ఇదే అంటూ విసురుగా సీటులోనుంచి బయటకు లేచి వెళ్లిపోయారట.

Leave a Reply