జగన్ బద్ధ శత్రువుకి క్యాబినెట్ బెర్త్?

 jagan enemy sathish kumar reddy have ap new cabinet
దసరాకి ఏపీ క్యాబినెట్ విస్తరణ ఖాయమైపోయింది.ఈసారి క్యాబినెట్ కూర్పు రాజకీయ అవసరాలు తీర్చేదిగా వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ..అందునా జగన్ కి కంచుకోట లాంటి కడపలో పార్టీని బలోపేతం చేయాలని బాబు డిసైడ్ అయ్యారు.అందుకే పులివెందులలో వైస్ కుటుంబాన్ని దశాబ్దంగా ఢీకొంటున్న సతీష్ కుమార్ రెడ్డి కి క్యాబినెట్ లో స్థానం కల్పించే అంశాన్ని బాబు చురుగ్గా పరిశీలిస్తున్నారు.

కడపలో ఇంతకముందు చేసిన ప్రయోగాలు విఫలం కావడానికి కారణాల్ని బాబు,లోకేష్ అన్వేషించారు.క్షేత్రస్థాయి బలం లేకుండా ఎన్నికలకి ముందు వచ్చే పారిశ్రామిక వేత్తల్ని నమ్ముకోవడం వల్లే పార్టీ ఎదగలేకపోయిందని స్థూలంగా తండ్రీకొడుకులు ఓ నిర్ణయానికి వచ్చారట.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజాక్షేత్రంలో నిలబడే వారినే ఇకపై ప్రోత్సహించాలని బాబు ఫీల్ అవుతున్నారట.ఆ కోవలో సతీష్ కుమార్ రెడ్డి కి క్యాబినెట్ స్థానం దక్కొచ్చని తెలుస్తోంది.వైస్ రాజారెడ్డి హత్య కేసు లో నిందితుడిగా వున్న సతీష్ క్యాబినెట్ లో చేరితే పులివెందులలో ఎంతోకొంత మార్పు వస్తుందని టీడీపీ మాత్రమే కాకుండా వైసీపీ కూడా భావిస్తోంది.ఆ పరిస్థితిని ఎదుర్కోడానికి జగన్ కౌంటర్ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు.

SHARE