జగన్ కి ‘ప్రశాంత’త లేనట్టేనా?

0
437
jagan feeling tensed

Posted [relativedate]

jagan feeling tensed
ఒక ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా ? కష్టమే కదా.కానీ ఒక్కోసారి అవసరాలు ఆ దిశగా ప్రయత్నించేట్టు చేస్తాయి.2019 లో వైసీపీ విజయానికి బాటలు వేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విషయంలో అదే జరిగింది.స్వతహాగా ఇతరుల ఆలోచనలకి పెద్దగా విలువ ఇవ్వని జగన్ వచ్చే ఎన్నికలు తనకు,పార్టీకి జీవన్మరణ సమస్య అని గుర్తించగలిగారు. అందుకే ఓ బిజినెస్ మ్యాన్ కం ఔత్సాహిక రాజకీయ నేత సలహా,ఆర్ధిక తోడ్పాటు తో ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకోడానికి డిసైడ్ అయ్యారు.ఈ మేరకు ప్రాధమిక ఒప్పందం కుదిరింది. ప్రశాంత్ టీం జగన్ అండ్ కో కి కొన్ని సూచనలు,సలహాలు ఇవ్వడం మొదలెట్టింది.పదేపదే తానే కాబోయే సీఎం అని చెప్పుకోవద్దని జగన్ కి ప్రత్యేకంగా చెప్పారు.అయినా ఆయన వినకపోవడంతో కొన్నిసార్లు ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.ఏదేమైనా యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి సేవలు పూర్తయ్యాక ఏపీ రాజకీయాల్లో పూర్తిగా దృష్టి పెట్టాలని ప్రశాంత్ భావించారు.జగన్ కూడా అదే అభిప్రాయంతో వున్నారు.యూపీ ఫలితాలు వచ్చాయి.ప్రశాంత్ ప్లాన్ ప్లాప్ అయ్యింది.ఆయన చేసిన సమాజ్ వాదీ,కాంగ్రెస్ పొత్తు ఆలోచన బీజేపీ దెబ్బకి తేలిపోయింది.నిన్నమొన్నటిదాకా సక్సెస్ దండ మెడలో వేసుకున్న ప్రశాంత్ అపజయం మూటగట్టుకొని తిరిగొస్తున్నాడు.
ఇప్పటికే ప్రశాంత్ పెడుతున్న షరతులతో ఇబ్బందులు పడుతున్న జగన్ ఆయన సక్సెస్ రేట్ చూసి మౌనం గా భరించాడు.ఇప్పుడు ప్రశాంత్ ఓ ప్లాప్ తో తన ముందుకి వస్తున్నాడు.ఎంత టాప్ డైరెక్టర్ అయినా కొన్ని ప్లాప్స్ తర్వాత ఓ భారీ సినిమా ఛాన్స్ దక్కడం ఎంత కష్టమో రాజకీయాల్లోనూ అదే పరిస్థితి.పైగా ప్రశాంత్ కూడా తనకు విలువ లేని చోట పని చేయడానికి పెద్దగా ఇష్టపడరు.ఇంకా సక్సెస్ పేరుని తన ఖాతాలో వేసుకోడానికి ఇష్టపడతారు.ఆ విషయం వల్లనే 2014 ఎన్నికల్లో మోడీకి భారీ విజయంలో కీలక పాత్ర పోషించినా తనకు పెద్దగా పేరు రాలేదని నితీష్,రాహుల్ తో కలిసి పనిచేశారు.ఆయనకి కూడా ఇప్పుడు ఓ విషయం అర్ధం చేసుకోవాలి .ప్రజాక్షేత్రంలో అభిమానం ఉంటే వాటిని ఓట్లుగా మార్చగలంగానీ,ప్రజాభిప్రాయాన్ని మార్చలేమని.ఈ విషయం అర్ధమైతే ప్రశాంత్ తన వ్యూహాల్లో మార్పు చేసుకోవచ్చు .జగన్ సైతం గెలుపు ఓటములు సహజమని ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రశాంత్ తో సామరస్య వాతావరణంలో పని చేయడానికి ఆసక్తి చూపితే మేలు. పైన మనం చెప్పుకున్నట్టు ఈ ఇద్దరూ సక్సెస్ తోడున్నప్పుడు కత్తులే.ఒకే ఒరలో ఇమడటం కష్టం. వీరి ఆటిట్యూడ్ కి కారణమైన ఆ సక్సెస్ ఇప్పుడు వీరికి దూరమైంది.దానికోసం ఇద్దరూ ఓ మెట్టుదిగి పనిచేస్తే ఇద్దరికీ మేలు.లేదంటే 2019 మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ కి ‘ప్రశాంత’త లేనట్టే.

Leave a Reply