పవన్ బాటలో జగన్…ఇదే సీక్రెట్

0
302
jagan following pawan kalyan

Posted [relativedate]

jagan following pawan kalyan
వై.ఎస్.జగన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షనేతగా ఏ ఒక్క ఛాన్స్ దొరికినా చంద్రబాబు సర్కార్ ని ఉతికిఆరేస్తుంటారు.తాజాగా అమరావతి వేదికగా సాగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా రోజా ని పోలీసులు అడ్డుకోవడం మీద ఎంత రచ్చ జరిగిందో చూశాం.ఈ ఎపిసోడ్ ని అందిపుచ్చుకున్న వై.ఎస్.జగన్ మరోసారి రెచ్చిపోయారు.ఓ ఎమ్మెల్యేకే ఇలా జరిగితే ఇక ఏపీ లో సామాన్య మహిళల కు భద్రత ఎక్కడుందని ఆయన నిలదీశారు.సదస్సుకి పిలిచి మరీ రోజాని ఇలా అడ్డుకున్న ఘటన మీద సరైన వేదికపై లేవదీస్తామని జగన్ చెప్పారు.ఈ వ్యవహారానికి పవన్ ని జగన్ అనుసరించడానికి ఎక్కడ సంబంధం ఉంది? ఇదేనా మీ డౌట్.అక్కడికే వస్తున్నాం.

రోజా ఎపిసోడ్ మీద జగన్ స్పందన ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా ? సోషల్ మీడియా ద్వారా జగన్ తన అభిప్రాయాలు చెప్పారు.ఇంతకుముందు జనసేన అధినేత పవన్ ని వైసీపీ నేతలు కొందరు ట్విట్టర్ స్టార్ అని ఎగతాళి చేసేవాళ్ళు.కానీ జగన్ ఇప్పుడు అదే పవన్ బాటలో సోషల్ మీడియా ని ఆశ్రయించారు.ఎందుకిలా? దీనివెనుక ఉన్న సీక్రెట్ బయటపడింది.2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నది యువ ఓటర్లే.వారిని కలవాలంటే ట్విట్టర్,ఫేస్ బుక్ దగ్గరికి వెళ్ళాక తప్పదు. ఈ విషయం గమనించి గానీ లేక సమయం లేక గానీ పవన్ కళ్యాణ్ మొదటినుంచి సోషల్ మీడియాని చురుగ్గా వాడేస్తున్నారు.సోషల్ మీడియా ప్రభావంతో ఆయన వ్యాఖ్యలకి ప్రచారం కూడా బాగానే వస్తోంది.ఒకప్పుడు ట్విట్టర్ స్టార్ గా పవన్ ని గేలి చేసిన వైసీపీ వ్యూహకర్తలకి ఈ విషయం కాస్త ఆలస్యంగా అర్ధమైంది.అటు వైసీపీ స్ట్రాటజీ కి కేంద్రబిందువు కాబోతున్న ప్రశాంత్ కిషోర్ సైతం సోషల్ మీడియా ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారట.ఈ నేపథ్యంలో రోజా ఎపిసోడ్ పై జగన్ స్పందన చూసాక పవన్ ని ఫాలో అవుతున్నాడని వేరే చెప్పాలా?

Leave a Reply