ఎన్నికలకు జగన్ భారీ స్కెచ్ ?

Posted January 25, 2017

jagan full sketch for elections by using ap special status
తమిళ తంబీల జల్లికట్టు ఉద్యమ పుణ్యమాని మళ్లీ రాజుకున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఇక వేడి తగ్గకుండా చూసేందుకు వైసీపీ అధినేత జగన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు.విశాఖ లో యువత తలపెట్టిన నిరసన ని అందుకు తొలి వేదికగా ఎంచుకోబోతున్నారు.ఆ రోజు విశాఖలో తాను స్వయంగా క్యాండిల్ ర్యాలీ లో పాల్గొనున్నట్టు జగన్ ప్రకటించారు.అంతే కాదు అంతకు ముందు ప్రకటించి పక్కనపెట్టిన ఎంపీల రాజీనామా అస్త్రాన్ని కూడా జగన్ బయటకు తీయబోతున్నారు.ఈ జూన్ లోగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించకపోతే వైసీపీ ఎంపీ లు రాజీనామా చేస్తారని ఆయన చెప్పారు.

జగన్ ప్లాన్ సక్సెస్ అయితే సార్వత్రిక ఎన్నికలకు ఓ సంవత్సరంన్నర ముందుగా ప్రత్యేక హోదా డిమాండ్ తో ఎన్నికలు వస్తాయి.అదే జరిగితే అధికారంలోని టీడీపీ,బీజేపీ లకు చుక్కలు చూపించవచ్చని జగన్ స్కెచ్ వేశారు.ఏపీ అభివృద్ధి విషయంలో పోలవరం,రాజధాని లాంటి కీలక అంశాల్లో చెప్పుకోదగ్గ పురోగతి కనిపిస్తే తప్ప హోదా అస్త్రాన్ని ఎదుర్కోవడం బాబు,మోడీలకు తలకు మించిన పనే..జగన్ సవాల్ ని ఆ నేతలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

SHARE