బాబాయ్,అబ్బాయ్,ఓ ఫ్రెండ్..భలే రాజకీయం

Posted [relativedate]

jagan giving priority to vellampalli srinivas malladi vishnu and avoid vangaveeti radha
విజయవాడ…ఏపీ రాజకీయాలకి కేంద్ర బిందువు.అయినా ఆ బిందువు కదలికలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పడం కష్టమంటారు రాజకీయ పండితులు..అలా ఎందుకంటారా అని ఓ సందేహం ఎప్పుడూ తొలుస్తుండేది.అక్కడ రాజకీయం అర్ధం చేసుకోడానికి ఎంత క్లిష్టమో తెలిపే ఎపిసోడ్ ఇది..ఈ ఎపిసోడ్ గురించి చదివాక ఆశ్చర్యం కలుగుతుందేమో కానీ సందేహాలు అలాగే ఉండిపోతాయి..అదెలాగో మీరే చూడండి..

రాజధాని ప్రాంతంలో బలం పుంజుకోకపోతే కష్టమని వైసీపీ అధినేత జగన్ ఓ అభిప్రాయానికి వచ్చారు.అనుకున్నదే తడవుగా అందుకోసం కొన్ని చర్యలు చేపట్టారు.పని చేయని నేతలని పక్కనబెట్టడం,పక్క పార్టీ నేతలకి వల వేయడం అందులో ముఖ్యమైనవి.వంగవీటి రాధాకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా విజయవాడలో వైసీపీ ని బలోపేతం చేయలేకపోయాడని జగన్ డిసైడ్ అయ్యాడు. ఆ స్థానంలో రాధా తో పెద్దగా పడని వెల్లంపల్లి శ్రీనివాస్ కి బాధ్యతలు ఇచ్చేసారు.ఈ పరిణామం సహజంగానే రాధాకి మంట పుట్టిస్తోంది.అదే టైం లో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ని పార్టీలోకి తీసుకు వచ్చేందుకు కూడా జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.మల్లాది పైకి ఇప్పట్లో పార్టీ మారబోనని చెబుతున్నా అనువైన సమయం కోసమే చూస్తున్నట్టు తెలుస్తోంది.ఇక విష్ణు రాక కూడా రాధాకి ఇబ్బంది కావొచ్చు అని అంటున్నారు.ఇదంతా రాధాని వదిలించుకోడానికి జగన్ వేస్తున్న ప్లాన్ అని వంగవీటి అభిమానులు అనుమానిస్తున్నారు.విష్ణు,వెల్లంపల్లి మధ్య సత్సంబంధాలు తెలిసినవారికి కూడా అదే ఆలోచన వస్తోంది.ఈ విషయం గురించి విష్ణుని అడిగితే ఆయన చెప్పిన సమాధానం అసలే చిక్కుముళ్లతో వున్న వ్యవహారాన్ని ఇంకాస్త బిగించినట్టుంది.”నేను ఇప్పట్లో పార్టీ మారాలి అనుకోవడం లేదు.ఏ పార్టీలో ఉన్నా వెల్లంపల్లితో మంచి స్నేహం కొనసాగుతూనే వుంది.రాధా నన్ను బాబాయ్ అని పిలుస్తాడు.ఈరోజు కూడా నాలుగైదుసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నాం “…ఇదీ విష్ణు చెప్పిన మాట.ఈ మొత్తం ఎపిసోడ్ చూసాక బాబాయ్,అబ్బాయ్,ఓ ఫ్రెండ్ వున్నారని తప్ప రాజకీయం గురించి ఒక్క ముక్కైనా అర్థమైందా? అదే మరి బెజవాడ రాజకీయమంటే..తగిలేదాకా తెలియని దెబ్బ…మారేదాకా ఊహించలేని రాజకీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here