జగన్ తప్పటడుగు వేస్తున్నారా?

  jagan going wrong way wrong steps
ఓ వైపు ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఊపందుకుంది…మరో వైపు ఇప్పుడిప్పుడే చంద్రబాబు సర్కార్ వైఫల్యాలు బయటపడుతున్నాయి.బాబు ఎంత గింజుకున్నా కేంద్రం ప్యాకేజ్ తో సరిపెట్టాలని చూస్తోంది…ఇవన్నీ ఆంధ్రాలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ అధినేత జగన్ కి కలిసొచ్చే అంశాలు.ఆయన కూడా క్షేత్ర స్థాయి సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తున్నారు.ఇంతలో హఠాత్తుగా ఓటుకునోటు కేసు తెర మీదకి వచ్చింది.వైసీపీ mla ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ రెండుమూడు రోజులు బాబు కి చికాకు కలిగించింది.అంతకు మించి ప్రయోజనం ఏముంది ?తాజాగా హై కోర్ట్ ఉత్తర్వులతో ఆ సరదా కూడా వైసీపీ కి తీరిపోయింది.

ఇప్పుడు జగన్ &కో ఇదే అంశాన్ని జనం దగ్గర హైలైట్ చేయాలని…ఈ కేసు కోసమే బాబు రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారని చెప్పాలని భావిస్తున్నారు.ఈ విషయం ముందుకు రాగానే కెసిఆర్,జగన్ కుట్రలో భాగమని టీడీపీ ఆరోపిస్తుంది.ఆ కేసులో నిందితుడు మత్తయ్య కూడా లేటెస్ట్ గా ఇదే మాట్లాడాడు.జగన్ అనుకున్నట్టు కెసిఆర్ సర్కార్ మరీ దూకుడుగా వ్యవహరించడానికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అడ్డుంది.పైగా రాజకీయాల్లో ఎంత మిత్రుడైనా పక్కవాడి ప్రయోజనాల కోసం సొంతంగా ఎవరైనా గొయ్యి తవ్వుకుంటారా ? కానీ జగన్ ఈ కేసు వల్ల ఏదో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.ఇద్దరు సీఎం లు ఇబ్బంది పడే పనికి ఏ ప్రభుత్వాలు మాత్రం పూనుకుంటాయి?

వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే జగన్ దాన్ని అర్ధం చేసుకోకుండా ఓటుకినోటుని పట్టుకుంటున్నారు.ఇది పైకి వచ్చిన ప్రతిసారి జగన్,కెసిఆర్ బంధం అన్న విమర్శలొస్తాయి .2014 ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రచారం వైసీపీకి నష్టం చేసింది.అయినా ఆ పార్టీ వ్యూహకర్తలు మేలుకోలేదు.పదేపదే చేసిన తప్పే చేస్తున్నారు.ఆంధ్రాలో ఏ రూపంలో కెసిఆర్ ప్రస్తావన వచ్చినా అది బాబుకి మంచిచేస్తుందన్న ప్రాధమిక విషయాన్ని మర్చిపోతున్నారు.ప్రభుత్వం మీద పోరాటానికి అవకాశమున్న ఎన్నో సమస్యల్ని వదిలిపెట్టి కోరి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు.హైకోర్ట్ ఉత్తర్వులతో అది మరోసారి రుజువైంది.ఇప్పటికైనా జగన్ తప్పటడుగులు మాని..ఆవేశాన్ని అణచుకొని ఆలోచనతో ముందుకెళితే వైసీపీ కి మేలు జరుగుతుంది.లేదా అయన అస్త్రం అనుకున్న అంశాలాలే బాబుకి ఆయుధాలవుతాయి ..తస్మాత్ జాగ్రత్త ..

SHARE