గొంగట్లో తింటూ వెంట్రుకలేరుతున్న జగన్ ..

Posted September 28, 2016

  jagan going wrong way
చంద్రబాబు మీద యుద్ధం చేద్దామన్న ఊపులో వైసీపీ అధినేత జగన్ చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారు. బాబు వైఫల్యాల గురించి మాట్లాడేందుకు ఎంతో సరకు కనిపిస్తున్నా..అక్కడ నుంచి విలువలు,అవినీతి టాపిక్ లోకి వెళ్లి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు.బాబు హయాంలో అవినీతి ఉండొచ్చు గానీ ..అందులోనే కేసులు,జైలు దాకా వెళ్లొచ్చిన జగన్ మాట్లాడుతుంటే దాని ప్రభావం కనపడకుండా పోతోంది.ఈ విషయం తప్పు చేసే జగన్ కి అర్ధం కాకపోయినా …వైసీపీ వ్యూహకర్తలైనా ఆయనకి సలహా ఇచ్చి ఉండాల్సింది.లేక వాళ్ళు చెప్పినా జగన్ పట్టించుకోవడం లేదా?

ఆ సంగతేమో గానీ తాజాగా మరో సారి జగన్ ఇదే కోవలో రాంగ్ స్టెప్ వేశాడు.ఇటీవల NRI లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఓ విచిత్రమైన పోలిక తెచ్చాడు.పెళ్ళై పిల్లాడు పుట్టిన లోకేష్ పెంపకం గురించి,తన పిల్లల పెంపకం గురించి పోల్చాడు.బాబు కొడుక్కి వెన్నుపోటు పాఠాలు చెబితే ,తాను మాత్రం విలువల గురించి చెప్తున్నట్టు వివరించాడు.అవినీతి కేసుల్లో జైలుకెళ్ళొచ్చిన మనిషి విలువలు గూర్చి చెప్తే NRI లకి ఆ మాత్రం అర్ధం కాదా?కమాన్ జగన్ ప్లాన్ మార్చు..నీ మంచికే చెప్తున్నాం కాస్త వినుకో

SHARE