కాంగ్రెస్ మళ్లీ జగన్ కొంపముంచుద్దా ?

    jagan got problems because congress
అధిష్టానం మాట ధిక్కరించి సీఎం పీఠం మీద కన్నేసినందుకు కాంగ్రెస్ ఒకప్పుడు జగన్ చుట్టూ అవినీతి కేసుల వలేసింది.దాంట్లో చిక్కుకున్న జగన్ నేటికీ అల్లాడిపోతున్నారు.ప్రత్యేక హోదా అంశం తెర మీదకొచ్చాక కాంగ్రెస్,వైసీపీ ల మధ్య కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తోంది.కాంగ్రెస్ తో పొత్తుండదని వైసీపీ చెప్తున్నప్పటికీ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోందని బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్లిందట.

ఇంతకముందు బీజేపీ సైతం జగన్ కేసుల విషయంలో వేచి చూసే ధోరణిలో వుంది.టీడీపీ మిత్రపక్షం అయినా రాజకీయ వైరుధ్యాలు ఉండటం వల్ల బీజేపీ చూసీచూడనట్టు పోయింది.ప్యాకేజ్ ప్రకటన తరువాత కమలం,సైకిల్ రాజకీయ బంధం బలపడింది.ఇప్పటిదాకా బాబు వ్యతిరేకుల మాటకి విలువిచ్చిన బీజేపీ అధిష్టానం వైఖరి మారిందని ఢిల్లీ వెళ్లొచ్చిన రాష్ట్ర కమలం నేతలే చెప్తున్నారు.రాజకీయ విమర్శలపై ఎదురు దాడి చేయాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చిన బీజేపీ అగ్రనేత ఒకరు జగన్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారట.కాంగ్రెస్ తో అంటకాగుతున్నందుకు తగిన ఫలితం అనుభవిస్తారని కూడా వ్యాఖ్యానించారట.ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ ..జగన్ కి ఏ మాత్రం అచ్చిరానట్టుంది.ఇంతకు ముందు శత్రుత్వంతో దెబ్బ కొడితే …ఇప్పుడు మిత్రత్వంతో చేటు చేసేలా ఉందని జగన్ అభిమానులు ఆందోళన పడుతున్నారట.

SHARE